Breaking News

Mahakumb‍: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి

Published on Sat, 02/22/2025 - 07:20

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జనవరి 13 నుంచి ప్రారంభమైన మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. భక్తులు తండోపతండాలుగా త్రివేణీ సంగమంలో స్నానం చేసేందుకు తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో సంగమతీరం నిత్యం భక్తుల రద్దీతో ఉంటోంది. ఫిబ్రవరి 26తో కుంభమేళా ముగుస్తున్న తరుణంలో ఈ శనివారం, ఆదివారం (ఫిబ్రవరి 22, 23) రోజుల్లో భక్తులు మరింతగా పోటెత్తే అవకాశం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.

కుంభమేళా చివరిదశకు చేరుకుంది. ఈరోజు, రేపు చాలామందికి సెలవుదినాలు కావడంతో వారంతా సంగమతీరానికి భారీగా తరలివస్తున్నారు. దీనిని గమనించిన ప్రభుత్వ అధికారులు(Government officials) తగిన ఏర్పాట్లు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, సంగమతీరంతో పాటు హనుమాన్‌ మందిరం ప్రాంతాల్లో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా కూడా ప్రయాగ్‌రాజ్‌లోనే ఉన్నారు. ఈయన కూడా కుంభమేళా ఏర్పాట్లను పర్యవేక్షించే పనిలో ఉన్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని ప్రస్తుత పరిస్థితుల గురించి డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌(డీఎం) కుమార్‌ మందార్‌ మీడియాతో మాట్లాడుతూ ‘వారాంతంలో భక్తుల రద్దీ ఏర్పడనున్న తరుణంలో మరిన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడికి వచ్చేవారికి పటిష్టమైన భద్రతను అందించేందుకు చర్యలు చేపట్టాం. సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశాం. ముందస్తుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీల సమీక్షా సమావేశం జరిగింది. ప్రవిత్ర స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి  ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షిస్తున్నాం’ అని అన్నారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh: స్నానపు దృశ్యాలు అప్‌లోడ్‌ చేసిన వారిపై చర్యలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)