Breaking News

Mahakumbh: మహాశివరాత్రికి చివరి పవిత్ర స్నానం.. సన్నాహాలివే..

Published on Mon, 02/24/2025 - 07:07

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ముగింపుదశకు చేరింది. మహాశివరాత్రి(ఫిబ్రవరి 26)తో ఈ మహోత్సవం ముగియనుంది. ఈ నేపధ్యంలో త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. శివరాత్రి రోజున మహాకుంభమేళాలో చివరి పవిత్ర స్నానాలు జరగనుండటంతో అధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

మహాశివరాత్రి(Mahashivratri) రోజున ఇక్కడికి తరలివస్తున్న భక్తులందరికీ పుణ్యస్నానాలు చేసే అవకాశం కల్పించే దిశగా అధికారులు పలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే  భారీగా భక్తులు తరలివస్తున్న నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌కు చేరే అన్నిమార్గాల్లో ట్రాఫిక్‌జామ్‌ నెలకొంటోంది. దీనిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు జనం పెద్ద సంఖ్యలో రైళ్లలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటున్నారు.

మహా కుంభమేళా(Mahakumbh) దృష్ట్యా ప్రతిరోజూ 80 నుండి 100 రైళ్లను రైల్వేశాఖ ప్రయాగ్‌రాజ్‌ మీదుగా నడుపుతోంది. ఇప్పుడు మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని, ఫిబ్రవరి 26న 200 కి పైగా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడపడానికి రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో 18 నుండి 20 కోచ్‌లు ఉంటాయి. అయితే, భక్తుల రద్దీ దృష్ట్యా 50 కి పైగా సాధారణ రైళ్లను రద్దు చేశారు. మహా కుంభమేళా సమయంలో భక్తుల కోసం 14 వేలకు పైగా రైళ్లు నడుస్తున్నాయి.

శనివారం (ఫిబ్రవరి 22) వరకు 60 కోట్లకు పైగా భక్తులు మహా కుంభ స్నానం చేశారని డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని మహాకుంభమేళా ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారని, సంగమ ప్రాంతానికి వచ్చే భక్తులు సురక్షితంగా స్నానం చేసి, వారి గమ్యస్థానానికి చేరుకునేలా పర్యవేక్షించేందుకు పలువురు అధికారులు ప్రత్యేక విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు  వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్లులు ప్రయాగ్‌రాజ్‌కు ఏ మార్గం నుండి వచ్చినా, దానికి సమీపంలోని పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారని వైభవ్ కృష్ణ తెలిపారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh: వామ్మో.. ఈ రైళ్లు ఇంతలేటా.. ఇక కుంభమేళాకు వెళ్లినట్లే!

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)