Breaking News

Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్‌ జామ్‌.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం

Published on Mon, 02/10/2025 - 07:18

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. ఈ మహోత్సవానికి దేశవిదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తున్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చూసినా పొడవైన ట్రాఫిక్‌ జామ్‌ కనిపిస్తోంది.

కుంభమేళా(Kumbh Mela)కు వచ్చిన భక్తులు రాష్ట్రంలోని అయోధ్య, వారణాసి, మధుర తదితర ఆలయాలను సందర్శిస్తున్నారు. దీంతో ఈ పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని ఆలయాల్లో కాలుమోపేందుకు కూడా స్థలం కనిపించని విధంగా ఉంది. ఆదివారం(ఫిబ్రవరి 9) సెలవు దినం కావడంతో లెక్కకుమించినంతమంది భక్తులు ఆలయాల ముందు బారులు తీరారు. కుంభమేళాకు వచ్చినవారిలో చాలామంది అయోధ్యను సందర్శిస్తున్నారు. దీంతో అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం ఆలయ ట్రస్ట్‌ పలు ఏర్పాట్లు చేసింది.

భ​క్తుల రద్దీ కారణంగా అయోధ్యలో విపరీతమైన ట్రాఫిక్‌  జామ్‌(Traffic jam) ఏర్పడింది. దీంతో ట్రాఫిక్‌ విభాగం వాహనాలను నియంత్రించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. ఈ నేపధ్యంలో పలు సమస్యలు తలెత్తాయి. ఇదేవిధంగా యూపీలోని సుల్తాన్‌పూర్‌లో కూడా విపరీతమైన ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక్కడి నుంచి భారీసంఖ్యలో జనం కుంభమేళాకు తరలివెళుతుండటంతో నేషనల్‌ హైవే వాహనాలతో నిండిపోయింది. ట్రాఫిక్‌ ఏమాత్రం ముందుకు కదలకపోవడంతో పలుచోట్ల ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

మధురలోని బృందావనం(Vrindavan in Mathura) కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం నాడు మధురకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించినవారంతా నేరుగా మధురకు చేరుకుని, శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో మధురలో ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. ఇదే తరహాలో వారణాసిలోనూ భక్తుల కోలాహలం కనిపించింది. కాశీలోని అన్ని గల్లీలు భక్తులతో నిండిపోయాయి. ఇక్కడి అన్ని ఆలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి.  

ఇది కూడా చదవండి: భలే కుర్రాడు.. ఆన్సర్‌ షీట్‌లో ఆ ఒక్క ముక్క రాసి..

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)