Breaking News

Mahakumbh: ఉదయం 8:30కే కోటిమందికిపైగా పుణ్యస్నానాలు

Published on Tue, 01/14/2025 - 11:09

నేడు మకర సంక్రాంతి సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తజనం పోటెత్తారు. ఈరోజు చేసే స్నానాన్ని అమృత స్నాన్ అని అంటారు. దీనిని ఆచరించేందుకు సంగమం ఒడ్డున భక్తులు బారులు తీరారు. ఉదయం 8.30 గంటల కల్లా కోటి మందికి పైగా జనం త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.

మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా అఖాడా వర్గానికి చెందిన సాధువులు అమృత స్నానాన్ని  ఆచరిస్తున్నారు. పంచాయితీ అఖాడా మహానిర్వాణి, శంభు పంచాయితీ అటల్ అఖాడా మొదట అమృత స్నానం ఆచరించారు. అమృత స్నాన సమయంలో 13 అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఇది ముగిసిన అనంతరం సామాన్యులు స్నానం ఆచరిస్తున్నారు. అమృత స్నాన్ మహా కుంభమేళాలో ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ఇందులో స్నానం చేసేందుకు మొదటి అవకాశం నాగ సాధువులకు ఇస్తారు.

పురాణాల్లోని వివరాల ప్రకారం సముద్ర మథనం నుండి వెలువడిన అమృత భాండాగారాన్ని దక్కించుకునేందుకు దేవతలు, రాక్షసులు ఒకరితో ఒకరు పోరాడుతున్నప్పుడు నాలుగు అమృత బిందువులు నాలుగు ప్రదేశాలలో (ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్,నాసిక్) పడ్డాయి. నాటి నుంచి ఈ ప్రాంతాల్లో మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైంది. నాగ సాధువులను మహాశివుని అనుచరులుగా పరిగణిస్తారు. అందుకే వారిని ముందుగా ఈ స్నానం ఆచరించడానికి అర్హులుగా భావిస్తారు. ఈ నేపధ్యంలోనే వారికి తొలుత స్నానం ఆచరించేందుకు అవకాశం కల్పిస్తారు.

ఇది కూడా చదవండి: రూ. 25 లక్షల చైనీస్‌ మాంజా స్వాధీనం.. బుల్డోజర్‌తో ధ్వంసం

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి