Breaking News

Mahakumbh: సంస్కృతంలో సంభాషిస్తున్న విదేశీ స్వాములు

Published on Tue, 01/21/2025 - 08:21

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోగల త్రివేణీ సంగమంలో భక్తులు మహాకుంభమేళా స్నానాలను ఆచరిస్తున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఉత్సవం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగనుంది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా తరలివస్తున్నారు. వీరిలో స్వామీజీలు కూడా ఉండటం విశేషం.

కుంభమేళాలోని 17వ సెక్టార్‌లో ఉన్న శక్తిధామ్  ప్రత్యేకమైన ఆశ్రమంగా పేరొందింది. ఈ ఆశ్రమంలోని తొమ్మిది మంది విదేశాలకు చెందిన మహామండలేశ్వరులు ఉన్నారు. వీరు సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఈ మహామండలేశ్వరులంతా హిందూధర్మాన్ని స్వీకరించారు. వీరిలో అమెరికా, ఇజ్రాయెల్‌ జపాన్‌కు చెందినవారున్నారు. ఈ తొమ్మిదిమంది మహామండలేశ్వరులలో ఏడుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

అమెరికాలో నివసిస్తున్న మహామండలేశ్వర్ అనంత్ దాస్ మహారాజ్ మీడియాతో మాట్లాడుతూ తాను అమెరికాలో ఉంటున్న సాయి మాతను కలుసుకున్నానని తెలిపారు. ఆ తరువాత తాను సనాతన ధర్మానికి అమితంగా ప్రభావితుడనయ్యానని అన్నారు. వెనువెంటనే సాయి మా ఆశ్రమంలో చేరానని, కొద్దిరోజుల తరువాత వారణాసికి వచ్చి, శక్తిధామ ఆశ్రమంలో మహామండలేశ్వర్ దీక్ష తీసుకున్నానని తెలిపారు. ఇప్పుడు తాను విద్యాబోధనతో పాటు యోగా నేర్పిస్తున్నానని, విదేశీయులను సనాతన ధర్మంతో అనుసంధానించడానికి కృషి చేస్తున్నానని తెలిపారు.

ఇది కూడా చదవండి: నేడు కుంభమేళాకు గౌతమ్‌ అదాని.. సంస్థ అందిస్తున్న సేవలివే..

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)