Breaking News

Mahakumbh : 15 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి.. మౌని అమావాస్య అంచనాలివే

Published on Tue, 01/28/2025 - 10:37

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా కుంభమేళా జరుగుతోంది. దేశ విదేశాల నుండి పర్యాటకులు, భక్తులు మహా కుంభమేళాకు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

మహాకుంభమేళాలో మూడవ పుణ్య స్నానం జనవరి 29న అంటే మౌని అమావాస్య రోజున జరగనుంది. ఆ రోజున పుణ్యస్నానం ఆచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తారనే అంచనాలున్నాయి. ఇప్పటివరకు మహా కుంభ స్నానం చేసే వారి సంఖ్య 15 కోట్లు దాటింది. గడచిన 17 రోజుల్లో 15 కోట్లకు పైగా జనం మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేశారు. మకర సంక్రాంతి సందర్భంగా 3.5 కోట్ల మంది భక్తులు, సాధువులు స్నానమాచరించారు.

రాబోయే మౌని అమావాస్య  సందర్భంగా 8 నుండి 10 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వస్తారనే అంచనాలున్నాయి. 2025 మహా కుంభమేళాకు మొత్తంగా 40 కోట్ల మంది హాజరవుతారనే అంచనాలున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య అనంతరం ఫిబ్రవరిలో వసంత పంచమి సందర్భంగా అమృత స్నానం జరగనుంది. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. ఇది ఫిబ్రవరి 26న అంటే మహాశివరాత్రి రోజున చివరి అమృత స్నానంతో ముగియనుంది.

ఇది కూడా చదవండి: ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)