Breaking News

ఒక్క రోజులో 1.5 కోట్ల మంది పుణ్యస్నానాలు

Published on Tue, 01/28/2025 - 08:00

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తాజాగా జనవరి 27 (సోమవారం) రాత్రి 10 గంటల వరకు ఒక్కరోజులో 1.5 కోట్లకు పైగా భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు.

జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకూ 14 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుంభమేళాలో పాల్గొని, పవిత్ర స్నానం చేశారు. ఈ సమయంలో  ఆయన వెంట ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బాబా రామ్‌దేవ్ తదితరులు ఉన్నారు.

మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు తరలివస్తున్నారు. ఇటాలియన్ భక్తుడైన ఆంటోనియో తాను భారతదేశంలో జరిగే కుంభమేళాను చూడాలనే తన కలను నెరవేర్చుకున్నానని తెలిపారు.   10 సంవత్సరాలుగా ఇక్కడికి రావాలనుకుంటున్నానని, ఇప్పుడు కుంభమేళా సమయంలో వచ్చానని మీడియాకు తెలిపారు. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అలాంటి 12 కుంభమేళాల తరువాత వచ్చిన మహా కుంభమేళా ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.

ఇది కూడా చదవండి: ఎవరెస్ట్‌ ఎక్కాలంటే రూ. 21 లక్షలు కట్టాల్సిందే

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)