Breaking News

Mahakumbh-2025: నేడు మరో సరికొత్త రికార్డు..

Published on Sat, 02/01/2025 - 09:52

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు 30 కోట్లకు పైగా భక్తులు స్నానాలు చేశారు.  ఈ సంఖ్య పలు రికార్డులను నెలకొల్పుతోంది. ప్రపంచంలోని 195 దేశాలలోని 192 దేశాల జనాభా 30 కోట్ల కంటే తక్కువగా ఉంది. అంటే ఆ 192 దేశాలకు మించినంతటి జనాభా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారని గణాంకాలు చెబుతున్నాయి. 
 
జనాభా పరంగా చూస్తే ప్రపంచంలోని నాల్గవ, ఐదవ అతిపెద్ద దేశాలైన ఇండోనేషియా, పాకిస్తాన్‌లలో కూడా 30 కోట్ల కంటే తక్కువ జనాభా ఉంది. దీనిప్రకారం చూస్తే కేవలం 19 రోజుల్లో పాకిస్తాన్, ఇండోనేషియా జనాభాకు మించిన భక్తులు త్రివేణీ సంగమంలో స్నానమాచరించారు. ఇండోనేషియా జనాభా(Indonesian population) 28 కోట్లు కాగా, పాక్‌ జనాభా 25.35 కోట్లు. కుంభమేళాకు వస్తున్న భక్తుల సంఖ్యను చూస్తే వసంత పంచమి(ఫిబ్రవరి 3)  నాటికి సంగమంలో పుణ్య స్నానాలు చేసే వారి సంఖ్య 35 కోట్లకు చేరుకుంటుందనే అంచనాలున్నాయి.

మహా కుంభమేళా ప్రారంభమైనప్పటి నుండి  ఇప్పటివరకూ  91,690 మంది  విమాన ప్రయాణం(Air travel) ద్వారా ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. 650 కి పైగా విమానాలు ఇక్కడకు రాకపోకలు సాగించాయి. ఇప్పుడు ఫిబ్రవరి ఒకటిన ఇక్కడికి వచ్చే విమానాలు, ప్రయాణికుల సంఖ్య గరిష్టంగా ఉండవచ్చనే అంచనాలున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుండి, తొలిసారిగా ప్రయాగ్‌రాజ్ నుండి చెన్నైతో సహా అనేక ప్రధాన నగరాలకు నేరుగా విమానాల రాకపోకలు ప్రారంభంకానున్నాయి. వీటిలో ఢిల్లీకి 10 విమానాలు,  ముంబైకి  ఏడు విమానాలు ఉన్నాయి. ఇది సరికొత్త రికార్డు కానుంది. 

ఇది కూడా చదవండి: Jharkhand: జేఎంఎంలోకి తిరిగి సీతా సోరెన్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)