Breaking News

Mahakumbh 2025: మహాకుంభమేళాలో మూడో రోజు విశేషాలు..

Published on Wed, 01/15/2025 - 11:06

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.

ఈరోజు(బుధవారం) మహాకుంభమేళాలో మూడవ రోజు. అత్యంత భారీస్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసేందుకు వివిధ ఘాట్‌ల వద్ద భక్తులు ఉదయం నుంచే క్యూలు కడుతున్నారు. మహా కుంభమేళా(Great Kumbh Mela) ప్రారంభమైనది మొదలుకొని ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు గంగా మాత హారతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీంతో సంగమతీరం నిత్యం భక్తులతో కిటకిటలాడుతోంది.

మంగళవారం మకర సంక్రాంతి(Makar Sankranti) సందర్భంగా సాధువులతో పాటు భక్తులు తొలి అమృత స్నానం చేశారు. 13 అఖాడాలకు చెందిన సాధువులు  ఒకరి తర్వాత ఒకరుగా స్నానం చేశారు. మకర సంక్రాంతి నాడు సుమారు 3.50 కోట్ల మంది భక్తులు గంగా సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. సోమవారం మొదటి స్నానోత్సవం నాడు 1.65 కోట్ల మంది భక్తులు స్నానం చేశారు. ఈ విధంగా రెండు రోజుల్లో మొత్తం 5.15 కోట్ల మంది సంగమంలో స్నానం చేశారు.

ఈసారి జరుగుతున్న మహా కుంభమేళా ఎంతో ప్రత్యేకమైనది. 144 ఏళ్ల తర్వాత  జరుగుతున్న కుంభమేళా ఇది. సంగమ తీరంలోని 4,000 హెక్టార్ల ప్రాంతంలో  ఈ ఉత్సవం జరుగుతోంది. మహా కుంభమేళాలో స్నానం చేసిన భక్తులు తాము సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. కుంభమేళా తొలిరోజున సంగమతీరంలో స్నానాలాచరిస్తున్న వారిపై హెలికాప్టర్‌ నుంచి పూలవర్షం కురిపించారు.

కన్నుల పండుగగా కుంభమేళ

ఇది కూడా చదవండి: Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి