Breaking News

Mahakumbh 2025: ప్రతి భక్తుని రక్షణ బాధ్యత మాదే: సీఎం యోగి

Published on Thu, 01/30/2025 - 07:40

ప్రయాగ్‌రాజ్‌: మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభ్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన  అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు జిల్లాల సీనియర్ పోలీసు అధికారులు, జిల్లా పరిపాలన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వారికి పలు సూచనలు చేశారు.

ప్రతి భక్తుని రక్షణ బాధ్యత ప్రభుత్వ అధికారులదేనని సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. మహా కుంభమేళా ప్రాంతంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల భద్రత, సౌలభ్యం కోసం చేసిన ఏర్పాట్ల గురించి ముఖ్యమంత్రి అయోధ్య, వారణాసి, మీర్జాపూర్, చిత్రకూట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారు సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరుకునేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అయోధ్య-ప్రయాగ్‌రాజ్, కాన్పూర్-ప్రయాగ్‌రాజ్, ఫతేపూర్-ప్రయాగ్‌రాజ్, లక్నో-ప్రతాప్‌గఢ్-ప్రయాగ్‌రాజ్, వారణాసి-ప్రయాగ్‌రాజ్ తదితర మార్గాల్లో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం  ఏర్పడకుండా సంబంధిత అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.

ఇది కూడా చదవండి: mahakumbh: 27 ఏళ్ల క్రితం అదృశ్యం.. నేడు అఘోరిగా ప్రత్యక్షం

Videos

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)