Breaking News

Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్‌ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..

Published on Tue, 01/21/2025 - 09:35

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యంత భారీగా జరుగుతున్న కుంభమేళాను వీక్షించేందుకు, సనాతన ధర్మం గురించి తెలుసుకునేందుకు లక్షలాదిమంది విదేశీయులు కూడా భారత్‌కు తరలిరావడం విశేషం. కుంభమేళాకు ఘన చరిత్ర ఉంది. 1942లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగిన కుంభమేళా ఉదంతం గురించి యూపీకి చెందిన భాషావేత్త పృథ్వీనాథ్ పాండే మీడియాకు తెలిపారు.

కుంభమేళా కేవలం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవమే కాదు. భారతదేశ స్వాతంత్య్రంలో కూడా కీలక పాత్ర పోషించింది. 1857లో ఆధ్యాత్మిక బోధనలు సాగించిన పండితుడు ప్రయాగ్వాల్ నాటి విప్లవకారులకు  అండగా నిలిచారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. ఆయన  స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా నాటి ఉద్యమకారులకు ఊపిరిపోశారన్నారు. నాడు మహారాణి లక్ష్మీబాయి ప్రయాగ్‌రాజ్ వచ్చినప్పుడు ఆమె పండితుడు ప్రయాగ్‌వాల్ ఇంట్లో ఆశ్రయం పొందారు. స్వాతంత్య్ర పోరాటంలో కుంభమేళా భాగస్వామ్యం కూడా ఉంది.  దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న 1918 నాటి రోజుల్లో కుంభమేళా అంత్యంత వైభవంగా జరిగింది. దీనిలో పాల్గొనేందుకు జాతిపిత మహాత్మాగాంధీ ప్రయాగ్‌రాజ్‌కు వచ్చారు. నాడు ఆయన త్రివేణి సంగమంలో స్నానం చేయడమే కాకుండా, అక్కడున్న సాధువులను కలుసుకున్నారు.  యాత్రికులతో సంభాషించారు.

హిందువుల ఐక్యతకు ప్రతిబింబంగా నిలిచిన కుంభమేళా ఉత్సవం బ్రిటిష్ ప్రభుత్వ ఆందోళనను మరింతగా పెంచింది.  మరోవైపు అదేసమయంలో గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం ఊపందుకుంది. 1942లో ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగింది. ఇది తమ పరిపాలనకు అడ్డుకులు కల్పిస్తుందనే ఉద్దేశంలో బ్రిటీషర్లు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే రైళ్లు, బస్సులను అడ్డుకున్నారు. ఈ ప్రయాణ సాధనాలకు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలను నిషేధించారని భాషావేత్త పృథ్వీనాథ్ పాండే తెలిపారు. కుంభ్ ప్రాంతం విప్లవ ప్రదేశంగా మారుతుందని బ్రిటీష్‌ పాలకులు భయపడ్డారు. బ్రిటీషర్లు అడ్డుకున్నప్పటికీ పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివచ్చి, పుణ్యస్నానాలు ఆచరించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. 

ఇది కూడా చదవండి: Kumbh Mela: కుంభమేళాకు వెళితే వీటిని తప్పక చూడండి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)