Breaking News

తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు

Published on Sun, 01/19/2025 - 10:14

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు లెక్కలేనంతమంది నాగ సాధువులు తరలివచ్చారు. వీరు చేసే కఠోర సాధన వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా ప్రయాగ్‌రాజ్‌లో 1500 మంది నాగ సాధువులుగా మారారు. వీరు జునా అఖాడా నుంచి దీక్ష తీసుకున్నారు.

నాగ సాధువుగా మారడానికి అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. ఈ ప్రక్రియకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వరకూ పడుతుంది. ఈ  కఠిన పరీక్షల్లో  విజయం సాధించాలంటే, సాధకుడు ఐదుగురు గురువుల నుండి దీక్ష పొందాలి. ఈ దీక్ష ఇచ్చేవారిని పంచ దేవ్ అని అంటారు.

నాగ సాధువుగా మారాలంటే, ఆ వ్యక్తి ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా త్యజించాలి.  తనకు తాను పిండప్రదానాన్ని చేసుకోవాలి.  భిక్షాటన  ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తినాల్సి ఉంటుంది. ఏ రోజైనా ఆహారం లభించకపోతే, ఆకలితోనే ఉండాలి.

తాజాగా జునా అఖాడాలో నాగ సాధువులుగా చేరిన 1,500 మంది, వారి తల్లిదండ్రులతో సహా ఏడు తరాల వారికి పిండప్రదానాన్ని చేశారు. దీంతో అతనికి ఇకపై తన కుటుంబంతో ఎలాంటి సంబంధం  ఉండదు.  ఈ నాగ సాధువులు తమ జీవితాంతం సనాతన ధర్మ పరిరక్షణకు, వేద సంప్రదాయ పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలి.

ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)