‘బెట్టింగ్‌ యాప్‌’ వరుడు పరార్‌.. ఈడీ అదుపులో అతిథులు

Published on Sat, 07/05/2025 - 09:53

ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనేవారు.. ఇప్పుడది మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అయితే ఇటీవలి రోజులలో అది మూడు రోజులకన్నా తక్కువ వ్యవధిలోనే ముగిసిపోతోంది. చివరికి పెళ్లిపీటల మీదే తెగతెంపులవుతున్న వ్యవహారాలూ కనిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.

జైపూర్‌: రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల ప్రముఖ ఫెయిర్‌మాంట్ హోటల్‌లో గతంలో ‘వార్తల్లో’ నిలిచిన  సౌరభ్ అహుజా వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. వేడుకలోని ఒక్కక్క కార్యక్రమం ఎంతో సందడిగా జరుగుతూ వస్తోంది. ఇక కొద్ది క్షణాల్లో నూతన వధూవరులు ఏడడుగులు వేసే కార్యక్రమం జరగనుంది. ఇంతలో హఠాత్తుగా వరుడు అక్కడి నుంచి మాయం అయ్యాడు. సౌరభ్ అహుజా మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో వాంటెడ్ నిందితుడు. ఇతను ఫెయిర్‌మాంట్ హోటల్‌లో వివాహం చేసుకోబోతున్నాడని తెలుసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరరేట్‌(ఈడీ) అధికారులు మండపానికి చేరుకున్నారు.

ఈ సంగతి ముందుగానే తెలుసుకున్న నిందితుడు సౌరభ్ అహుజా ఏడడుగుల తంతుకు ముందు పరారయ్యాడు. దీంతో ఈడీ అధికారులు నూతన వధువుతో పాటు ఇతర కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. రూ. 15 వేల కోట్ల మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో అహుజా వాంటెడ్ నిందితుడు. అతన్ని అరెస్టు చేయడానికి ఈడీ అధికారులు చేసిన ప్రయత్నం విఫలమయ్యింది. మహాదేవ్ యాప్  ప్రాథమిక ఆపరేటర్లలో అహుజా ఒకడు. అతిథులు తెలిపిన వివరాల ప్రకారం వరుడు పెళ్లి దుస్తుల్లోనే పరారయ్యాడు. మనీలాండరింగ్ కేసులో నిందితుడైన సౌరభ్‌  కొంతకాలంగా ఈడీ అధికారులను తప్పించుకుని తిరుగుతున్నాడు. కల్యాణ మండపం నుంచి అతను పారిపోయేందుకు సహకరించిన ముగ్గురిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అర్జెంటీనా చేరిన ప్రధాని మోదీ.. అధ్యక్షుడు జేవియర్ మిలేతో భేటీ

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)