Breaking News

కూటమిలో మహా చిచ్చు

Published on Sun, 03/01/2026 - 06:17

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెలల్లో జరగనున్న రాజ్య సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో విపక్ష కూటమైన మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)లో రాజకీయ చిచ్చు రేగుతోంది. విపక్ష కూటమికి దక్కే ఒకే ఒక్క సీటుపై అటు ఎన్‌సీపీ (శరద్‌ పవార్‌), ఇటు శివసేన (ఉధ్దవ్‌ బాల్‌ఠాక్రే) పార్టీలు పట్టుబడుతుండటంతో వివాదం ముదురుతోంది. అత్యధిక సీట్లున్న తమకే రాజ్యసభ సీటు దక్కాలని పవార్‌ వర్గం బలంగా డిమాండ్‌ చేస్తోంది. ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన కూటమిలోని కాంగ్రెస్‌ మౌనంగా ఉండిపోవడం ఈ వివాదాన్ని మరింత తీవ్రం చేస్తోంది. 

ఎవరికి వారే..: మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, 7 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఒక రాజ్యసభ సీటుకు 37 ఓట్లు అవసరం కాగా, ప్రస్తుతం 235 సీట్లున్న ఎన్డీయేకు 6 స్థానాలు దక్కడం ఖాయం. మిగతా ఒక్క స్థానం మాత్రమే విపక్షాలకు దక్కనుంది. విపక్ష కూటమి అయిన ఎంవీఏలో సేన యుబీటీకి 20, కాంగ్రెస్‌కు 16, శరద్‌ పవార్‌ వర్గానికి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రు. 

ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న పవార్‌ వర్గానికి చెందిన ప్రియాంక చతుర్వేదిని తిరిగి కొనసాగించాలని ఆ పార్టీ మొదట డిమాండ్‌ చేసింది. అయితే గతంలో రాజ్యసభ ఎన్నికలకు మళ్లీ పోటీ చేయనని గతంలో ప్రకటించిన శరద్‌ పవార్, తాజా పరిణామాల నేపథ్యంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నా రు. ఎన్‌సీపీ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మర ణం తర్వాత మనసు మార్చుకున్న శరద్‌ పవార్‌ రాజ్యసభ కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

ఈ నేపథ్యంలో పవా ర్‌ పార్టీ ఈ సీటు కోసం పట్టుబడుతోంది. దీనిపై పవార్‌ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే సైతం స్పందిస్తూ, ‘పవార్‌ రాజ్యసభకు వెళ్లాలన్నది పార్టీలో అందరి కోరిక’అని వ్యా ఖ్యానించారు. ఈ విషయమై ఆమె కాంగ్రెస అగ్రనేతలతో మంతనాలు సైతం ప్రారంభించారు. ఈ సమయంలోనే సేన యూబీటీ నేతలు పవార్‌ ఆరోగ్యాన్ని చర్చకు పెట్టారు. వృధ్ధాప్య సమస్యలతో తరుచూ ఆస్పత్రి పాలవుతున్న పవార్‌ నుంచి ప్రజా ప్రతినిధిగా ఏం ఆశించగలం అంటూ యూబీటీ నేతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే సైతం ఈ సీటుపై తమకే మొదటి హక్కు ఉందంటున్నారు. 

కూటమిలో విభజన వచ్చేలా మాటల మంటలు రేగుతున్నా కాంగ్రెస్‌ మాత్రం మౌనంగానే ఉంది. అభ్యర్థిత్వంపై ఇప్పటివరకు స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్‌ సప్కాల్‌ మాట్లాడుతూ, కూటమి భాగస్వాములు కలిసి అభ్యర్థిని నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ పరిణా మాలతో శివసేన యుబీటీ, శరద్‌ పవార్‌ వర్గాల మధ్య సర్దుబాటు ఎలా కుదురుతుందో చూడాల్సి ఉంది. ఈ నిర్ణయం కూటమి భవిష్యత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)