Breaking News

శివరాత్రి వేళ.. ‘మౌని అమావాస్య’ బాధితులు ఏమన్నారంటే..

Published on Thu, 02/27/2025 - 10:15

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాశివరాత్రి వేడుకలతో మహాకుంభమేళా(Mahakumbh Mela) పరిసమాప్తమయ్యింది. శివరాత్రి రోజున ఆఖరి పవిత్ర స్నానాలు కావడంతో లెక్కలేనంతమంది భక్తులు తరలివచ్చారు. మహాకుంభమేళాలో మొత్తం 66 కోట్ల మంది త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కాగా మౌని అమావాస్య నాటి రద్దీని చూసి, ఆనాడు వెనుదిరిగిన బీహార్‌కు చెందిన ఒక కుటుంబం తిరిగి శివరాత్రి నాడు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు మహాకుంభమేళాకు వచ్చింది. వీరు మౌని అమావాస్య రోజున జరిగిన విషాదాన్ని  మీడియాకు వివరించారు.

బీహార్‌(Bihar)లోని బక్సర్‌లో ఉంటున్న ఆ కుటుంబ సభ్యులలో ఒకరైన మహిళ మీడియాతో మాట్లాడుతూ మౌని అమావాస్య రోజున మహాకుంభమేళాలో జనసమూహాన్ని చూసి, ఇక స్నానాలు చేయలేమని భావించి నిరాశగా ఇంటికి తిరుగుముఖం పట్టామన్నారు.  ఇప్పుడు శివరాత్రి వేళ పుణ్యస్నానాలు ఆచరించేందుకు తిరిగి వచ్చామన్నారు. అదే కుంటుంబానికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ మౌని అమావాస్యనాడు విషాద ఘటన సంగమ్‌ నోస్‌ వద్ద జరగిందని అన్నారు. ఆ రోజున జనం ఎటువైపు వెళుతున్నామో తెలియనంతగా పరిగెట్టారన్నారు. దీనిని చూసిన మా అంటీ భయంతో రోదించసాగారని, దీంతో నేను ఆమెను ఇక్కడి నుంచి పంపించేందుకు ‍ప్రయాగ్‌రాజ్‌ జంక్షన్‌ వరకూ దిగబెట్టానని అన్నారు.

ఇదే కుటుంబానికి చెందిన మరో మహిళ మాట్లాడుతూ ఆరోజున తొక్కిసలాట(Stampede) ఎంతగా జరిగిందంటే ఒకరిమీదకు మరొకరు ఎక్కిపోయారన్నారు.  అలాగే అందరూ ఒకవైపుగా తోసుకుంటూ పరిగెట్టారని, అక్కడి పరిస్థితి చూసి తామంతా భయపడిపోయామని, పుణ్య స్నానాలు చేయకుండానే వెనుదిరిగామన్నారు. ఆరోజు 25 మంది వరకూ మృతి చెందడాన్ని చూశానని, తనను ఆ గుంపు నుంచి పోలీసులు కాపాడారని, ఊపిరి ఆడని స్థితిలో తనకు ఆక్సిజన్‌ అందించారని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉండటంతో తాము ఎంతో సంతృప్తికరంగా పుణ్య స్నానాలు చేశామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఆకట్టుకున్న మహా కుంభమేళా చివరి హారతి

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)