Breaking News

Mahakumbh-2025: యాత్రికులకు మమతా సర్కారు హెల్ఫ్‌డెస్క్‌

Published on Sun, 02/02/2025 - 08:34

కోల్‌కతా: మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన మమతా సర్కారు పశ్చిమ బెంగాల్‌ నుంచి కుంభమేళాకు వెళ్లేవారికి పలు సూచనలు జారీ చేసింది. ఒక హెల్ప్‌ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

కుంభమేళాకు పశ్చిమబెంగాల్‌ నుంచి వెళుతున్న యాత్రికులకు ఏదైనా అత్యవసర పరిస్థితి(Emergency) తలెత్తినప్పుడు ఈ హెల్ప్‌డెస్క్‌ సాయం అందించనుంది. వారంలో ప్రతిరోజూ 24 గంటల పాటు సహాయం అందించేందుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ, పౌర రక్షణ శాఖ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ హెల్ప్‌డెస్క్‌(Helpdesk) పర్యవేక్షణ జరగనుందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు.  రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు మహా కుంభమేళాకు వెళ్తున్నారని, వారికి సహాయం చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందన్నారు.

ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు హెల్ప్‌లైన్ నంబర్ (033) 2214-3526, టోల్-ఫ్రీ నంబర్ 1070ను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో పశ్చిమ బెంగాల్‌(West Bengal)కు చెందిన నలుగురు యాత్రికులు మృతిచెందగా, తొమ్మిది మంది గల్లంతయ్యారు. ఇదిలావుండగా మహా కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల గణాంకాలను ప్రభుత్వం అందించాలని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ డిమాండ్‌ చేశారు.

బీజేపీ ప్రభుత్వాన్ని ఎవరూ విశ్వసించడం లేదన్న అఖిలేష్‌ ఒక ప్రకటనలో ఈ ప్రభుత్వానికి దేశ ప్రజల విషయంలో ఎలాంటి దార్శనికత లేదు. నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు, యువత, పేదలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో బడ్జెట్ గణాంకాల కంటే, మహా కుంభ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మరణించిన, గాయపడిన, తప్పిపోయిన వారి గణాంకాలు చాలా ముఖ్యమైనవని అఖిలేష్  పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)