Breaking News

Mahakumbh: ఉత్సాహం ఉరకలేస్తోంది: బల్గేరియా పర్యాటకులు

Published on Tue, 01/14/2025 - 12:24

ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా జనం కుంభమేళాలో స్నానమాచరించేందుకు తరలివస్తున్నారు.

వివిధ దేశాల నుంచి ఇక్కడికి తరలివస్తున్న విదేశీయులు(Foreigners) ఇక్కడి సనాతన సంస్కృతితో పరిచయం పెంచుకుని, దానిని అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారు. కుంభమేళా మొదటి రోజున దాదాపు ఒక కోటి 65 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. తొలిరోజున 20 దేశాలకు చెందిన  భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

యూరోపియన్ దేశమైన బల్గేరియా నుండి పర్యాటకుల బృందం మహా కుంభమేళా(Kumbh Mela)కు తరలి వచ్చింది. 12 మంది సభ్యులతో కూడిన ఈ బృందం జనవరి 16 వరకు ఇక్కడే ఉండనున్నారు. వీరు సనాతన ధర్మం గురించి పండితులు, స్వామీజీల నుంచి తెలుసుకోనున్నారు. ఈ బృందంలో చాలా మంది ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు. వారు తమ కెమెరాలతో మహా కుంభమేళాలోని పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.

వారు మన దేశానికి చెందిన ఋషులు, సాధువులు, అఖారాల సంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విదేశీ పర్యాటకుల బృందం  గంగా నదిలోని వివిధ ఘాట్‌లను సందర్శిస్తోంది. బల్గేరియా(Bulgaria)కు చెందిన టట్యానా మాట్లాడుతూ, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గురించి తాను గతంలో విన్నానని తెలిపింది. ఈ మహా కుంభమేళా గురించి  తెలియగానే దీనిలో  పాల్గొనాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది.

తన స్నేహితులు కూడా మహా కుంభమేళాకు వచ్చారని టట్యానా చెప్పింది. ఇక్కడ  వారు భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని  అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ మహా కుంభమేళా గురించి తాను విన్న దానికంటే ఇక్కడ అంతా భారీగా కనిపిస్తున్నదన్నారు. ఈ మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదని టటన్యా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Mahakumbh: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. తప్పిన ప్రమాదం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)