Breaking News

Maha Kumbh-2025: 104 నాగసాధు అభ్యర్థనలు రద్దు.. 12 అఖాడాల నిర్ణయం

Published on Thu, 01/23/2025 - 09:40

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. ఇక్కడికి వచ్చే సామాన్యులను మహామండలేశ్వరులు, నాగ సాధువులు అమితంగా ఆకర్షిస్తున్నారు. అయితే మహామండలేశ్వరులు, నాగసాధువులుగా మారడం అంత సులభం కాదు.

మహామండలేశ్వరులు, నాగ సాధువులుగా మారేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. జీవితంలో సత్యనిరతి, సనాతనధరంపై అంకితభావం కలిగివుండాలి. ఈ విలువలకు అఖాడాలు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. మహామండలేశ్వరులు, నాగ సాధువులకు అఖాడాలు దీక్షనిస్తారు. జీవితంలో ఏమాత్రం విలువలు పాటించకుండా సాధకులమని చెప్పుకునేవారికి దీక్షలు ఇచ్చేందుకు అఖాడాలు ఆసక్తి చూపరు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో మహామండలేశ్వరులు, నాగసాధుకులుగా మారాలనుకున్న పలువురికి నిరాశ ఎదురయ్యింది.

మహామండలేశ్వరులుగా మారాలనుకున్న 12 మంది సాధకులు, సాగ సన్యాసం స్వీకరించాలనుకున్న 92 మంది సాధకుల దరఖాస్తులను అఖాడాలు తిరిస్కరించారు. జునా అఖాడా, ఆవాహన్ అఖాడా, నిరంజని అఖాడా, బడా నిరంజని అఖాడాలు మొత్తం 104 అభ్యర్థనలను తిరస్కరించారు. ఈ అభ్యర్థుల తీరుతెన్నులు సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని తేలండంతో అఖాడాలు వీరి దరఖాస్తులను తిరస్కరించారు.

మకర సంక్రాంతి నుండి ఇప్పటివరకు వివిధ అఖాడాలలో కొత్తగా 30 మందికి మహామండలేశ్వరులుగా, 3,500మందికి నాగ సాధువులుగా దీక్ష ఇచ్చారు. వసంత పంచమి నాడు జరిగే మూడవ అమృత స్నానం వరకు, మహామండలేశ్వరులకు,  నాగ సన్యాసులకు దీక్షనిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది.

మహామండలేశ్వరులు, లేదా నాగ సాధువుగా మారేందుకు ముందుగా అఖాడాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం వారు ఆ దరఖాస్తులో తల్లిదండ్రులు, విద్యార్హతతో సహా పలు వ్యక్తిగత వివరాలు తెలియజేయాలి. వీటిని అఖాడాలు సమగ్రంగా పరిశీలిస్తారు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులలో నిరంజని అఖాడా ఆరు దరఖాస్తులను, జునా అఖాడా నాలుగు దరఖాస్తులను, ఆవాహన్ అఖాడా మహామండలేశ్వర్‌గా మారేందుకు వచ్చిన రెండు దరఖాస్తులను రద్దు చేసింది. నాగ సాధువులుగా మారేందుకు వచ్చిన దరఖాస్తులలో 92 దరఖాస్తులను రద్దు చేశారు. 

ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)