Breaking News

Maha Kumbh-2025: అండర్‌ వాటర్‌ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్‌ పోలీస్‌ పోస్టులతో నిఘా

Published on Mon, 01/13/2025 - 11:24

ప్రయాగ్‌రాజ్‌: మహాకుంభమేళా.. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు.

పటిష్టమైన భద్రత
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభోత్సవం సుమారు 45 కోట్ల మందికి ఆతిథ్యం ఇస్తుందని అంచనాలున్నాయి. ఇది భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలువనుంది. కుంభమేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహా కుంభ్ సమయంలో జనానికి పటిష్టమైన భద్రతను కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ పోలీసులు నగరం చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

అండర్‌వాటర్‌ డ్రోన్లు
తొలిసారిగా త్రివేణి సంగమప్రాంతంలో 24 గంటలూ నిఘా సారించేందుకు నగరం అంతటా 100 మీటర్ల వరకు డైవ్ చేయగల నీటి అడుగున వినియోగించే డ్రోన్‌లను మోహరించినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదేవిధంగా 120 మీటర్ల ఎత్తు వరకూ వెళ్లగల టెథర్డ్ డ్రోన్‌లను కూడా మోహరించారు. ఇవి పెరుగుతున్న జనసమూహాన్ని  గుర్తించేందుకు వైద్యసాయం లేదా భద్రతా సాయం అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించేందుకు ఉపకరిస్తాయని భద్రతా అధికారులు తెలిపారు.

2,700 ఏఐ కెమెరాలు
రియల్-టైమ్ పర్యవేక్షణ, ముఖ గుర్తింపు సాంకేతికతను అందించే కృత్రిమ మేధస్సు (ఏఐ) సామర్థ్యం కలిగిన 2,700 కెమెరాలను వివిధ ఎంట్రీ పాయింట్ల వద్ద ఉపయోగిస్తున్నారు. దీనితో పాటు 56 మంది సభ్యుల సైబర్ వారియర్ల బృందం ఆన్‌లైన్ బెదిరింపులను పర్యవేక్షిస్తుంది. దీనికితోడు నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. కాగా యాత్రికులకు వసతి కల్పించడానికి అధికారులు 1,50 వేల టెంట్లతో పాటు అదనపు టాయిలెట్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 4,50 వేల నూతన విద్యుత్ కనెక్షన్‌లను ఏర్పాటు చేశారు. యాత్రికుల కోసం ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేలు కుంభమేళా సందర్భంగా 3,300 ట్రిప్పులు తిరిగే 98 ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టాయి. కుంభ్ సహాయాక్ చాట్‌బాట్ అనేది అత్యాధునిక ఏఐ సాధనం. ఇది మహా కుంభమేళాకు హాజరైన భక్తులకు అనేక విధాలుగా సహాయపడనుంది.

ఫ్లోటింగ్‌ పోలీస్‌ పోస్టు

 

 కుంభమేళాలో పాల్గొనే భక్తులకు మరింతగా సహాయం అందించేందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఫ్లోటింగ్‌ పోలీస్‌ పోస్టు ఏర్పాటు చేశారు. ఇదేవిధంగా భక్తులు ప్రయాణించే వాహనాలు సజావుగా ముందుకు కదిలేందుకు ట్రాఫిక్ పోలీసు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. త్రివేణీ సంగమానికి ప్రవేశ మార్గం జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్ (బ్లాక్ రోడ్) ద్వారా ఉంటుంది. నిష్క్రమణ మార్గం త్రివేణి మార్గ్ గుండా ఉంటుంది. కాగా రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్  మాట్లాడుతూ రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలపై  ఎంతో శ్రద్ధ తీసుకున్నామని. సాధారణ రైళ్లతో సహా మొత్తం 13,000 రైళ్లను కుంభమేళా కోసం నడుపుతున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాకు 45 కోట్లకు పైగా భక్తులు తరలి వస్తారనే అంచనాలున్నాయి. 

ఇది కూడా చదవండి: Mahakumbh 2025: ఇప్పటికే 85 లక్షలమంది పుణ్యస్నానాలు!
 

 

Videos

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు