Breaking News

మహాకుంభమేళాలో తదుపరి పవిత్ర స్నానం ఎప్పుడు?

Published on Wed, 02/12/2025 - 13:46

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు (బుధవారం) భక్తులు మాఘపౌర్ణమి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నాటికి 1.20 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి పుణ్య స్నానాల సందర్భంగా కుంభమేళా అధికారులు హెలికాప్టర్‌లో భక్తులపై పుష్పవర్షం కురిపించారు. ప్రస్తుతం త్రివేణీ సంగమంలో పవిత్రస్నానాలు ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు.  ఈరోజు సుమారు రెండు కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మహాకుంభమేళా ప్రారంభమైనది మొదలు ఇప్పటివరకూ మూడు అమృత స్నానాలు పూర్తయ్యాయి. దీంతో తదుపరి పుణ్య  స్నానం ఎప్పుడనే సందేహం చాలామందిలో ఉంది.
 

కుంభమేళా నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 26న తదుపరి పవిత్ర స్నానాలు  ఉండనున్నాయి. ఆరోజు మహాశివరాత్రి  కావడం విశేషం. శివుని భక్తులు ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అదేరోజున కుంభమేళాలో పవిత్ర స్నానం చేసేందుకు శివభక్తులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో శివరాత్రి రోజున కుంభమేళాకు లెక్కకుమించినంతమంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: అక్షరాలు దిద్దుతున్న కుంభమేళా మోనాలిసా

Videos

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

వామ్మో అన్ని కోట్లా? నాగార్జున రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)