Breaking News

‘నిందితుడు కాదు నిర్దోషి’.. మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

Published on Tue, 10/28/2025 - 15:27

చెన్నై: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద పదేళ్ల జైలు శిక్ష పడిన ఎ విఘ్నేష్‌ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అతని సహ నిందితుని వాంగ్మూలం ఆధారంగా శిక్ష విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉదంతంలో తప్పుడు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన ముగ్గురు పోలీసులు.. బాధితునికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

2021 నాటి ఈ కేసు వివరాల్లోకి వెళితే.. మధురైలోని తిదిర్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి.. మెల్వాసల్ సమీపంలో ఎ. విఘ్నేష్ సహా కొంతమంది వ్యక్తులు 24 కిలోల గంజాయిని తీసుకెళ్తున్నారని సమాచారం అందింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారందినీ అరెస్టు చేశారు.  అనంతరం మధురై స్పెషల్ కోర్టు నిందితులకు పదేళ్ల  జైలు శిక్ష విధించింది. అయితే విఘ్నేష్ దీనిని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో అప్పీల్  చేసుకున్నాడు. ఈ కేసులో సహ నిందితుడి ఒప్పుకోలు తప్ప, నేరంలో నిందితుడి ప్రమేయానికి సంబంధించి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలను లేవని కోర్టులో అతని తరపు న్యాయవాది వాదించారు.  

కేసును విచారించిన న్యాయమూర్తి కె. రామకృష్ణన్ మాట్లాడుతూ..  నిష్పాక్షిక విచారణ నిందితుల ప్రాథమిక హక్కు అని అన్నారు. నిందితుడు విఘ్నేష్ నుండి పోలీసులు ఎటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని  విచారణలో తేలిందన్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో విఘ్నేష్ ఉన్నాడనేందుకు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొన్నారు. అందుకే విఘ్నేష్‌ను దోషిగా నిర్ధారించడానికి కోర్టు నిరాకరిస్తున్నదని స్పష్టం చేశారు

తిదిర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో నాడు విధుల్లో ఉన్న పోలీసు అధికారులు పనరాజ్, సెంథిల్‌కుమార్,  మహమ్మద్ ఇద్రిస్ తదితరులు ట్రయల్ కోర్టులో తప్పుడు సాక్ష్యం  ఇచ్చి, విఘ్నేష్‌ను దోషిగా నిర్ధారించేందుకు కుట్ర పన్నడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ముగ్గురు పోలీసు అధికారులు బాధితుడు విఘ్నేష్‌కు సంయుక్తంగా రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఈ ముగ్గురు పోలీసుల ప్రవర్తనపై దర్యాప్తు చేయాలని కోర్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Rajasthan: మంటల్లో మరో బస్సు.. ఇద్దరు మృతి

 

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)