Breaking News

సర్పంతో ఆటలాడితే అంతే

Published on Thu, 07/17/2025 - 09:03

భోపాల్‌: నాగ పామును మెడకు చుట్టుకొని, బైక్‌ నడుపుతూ సాహసం చేయబోయిన ఓ వ్యక్తి అదే పాము కాటు వేయడంతో మృతిచెందాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాధితుడిని దీపక్‌ మహావర్‌గా గుర్తించారు. పాముతో బైక్‌ నడుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీపక్‌ స్థానిక జేపీ కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పాములను పట్టడంలో నేర్పరిగా పేరుంది. 

వేలాది పాములను రక్షించి, సురక్షిత ప్రాంతాల్లో వదిలేశాడు. ఇటీవల నాగు పామును పట్టుకున్నాడు. దాన్ని అందరికీ చూపించాలని భావించాడు. అందుకే మెడకు చుట్టుకొని బైక్‌ నడిపాడు. కానీ, పాము అతడిని కాటు వేసింది. దీపక్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఆలస్యంగా తీసుకురావడంతో రక్షించలేకపోయామని డాక్టర్లు చెప్పారు. దీపక్‌ భార్య గతంలోనే మృతిచెందారు. అతడికి రౌనక్, చిరాగ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల మరణంతో వారు అనాథలుగా మారిపోయారు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)