Breaking News

గొంతుకోసి చెత్తకుప్పలోకి విసిరేస్తే..

Published on Sat, 02/15/2025 - 14:17

ఆడబిడ్డ పుట్టిందని ఏ చెత్తకుప్పల్లోనో, గుడిమెట్ల మీద వదిలేసే ఘటనలు చూసే ఉంటారు. కానీ, ఇక్కడ ఓ నాన్నమ్మ వద్దనుకోవడంతోనే ఆగిపోలేదు. అతికర్కశంగా.. తన కొడుకుకు పుట్టిన బిడ్డను గొంతు కోసి చెత్తకుప్పలో పడేసింది. అయితే.. తుంచిన ఆ పసిమొగ్గకు వైద్యులు మళ్లీ ఊపిరిపోసి పునర్జన్మ ప్రసాదించారు. 

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో.. నెలరోజుల కిందట అప్పుడే పుట్టిన ఆడపిల్లను గొంతు కోసి చెత్తకుండీలో పడేసింది ఆమె నానమ్మ. రక్తపుమడుగులో చలనం లేని స్థితిలో పడి ఉన్న బిడ్డ దేహాన్ని పోలీసులు భోపాల్‌లోని కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మెడ భాగంలో తీవ్ర స్రావం కావడంతో బతకడం కష్టమేనని వైద్యులు భావించారు. అయితే.. పెద్ద అద్భుతమే జరిగింది!. 

పాప గొంతు కోసినా కీలకమైన ధమనులు, సిరల తెగలేదు. దీంతో పలు శస్త్రచికిత్సలు చేసి ఆమెను బతికించగలిగారు వైద్యులు. మొత్తంగా.. ఆ బిడ్డకు నెల రోజులపాటు చికిత్స అందించి కోలుకునేలా చేశారు. పైగా ఆ పాపకు పీహూ అని పేరు పెట్టారు. బాలల సంక్షేమ కమిటీ అనుమతితో మృత్యువును జయించిన పీహూను రాజ్‌గఢ్‌లోని ఓ ఆశ్రయ కేంద్రానికి తరలించినట్లు ఆస్పత్రి హెచ్‌వోడీ డాక్టర్‌ ధీరేంద్ర శ్రీవాత్సవ్‌ తెలిపారు. 

మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదుకాగా, నాన్నమ్మ, ఆ పసికందు తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే మధ్యప్రదేశ్‌ లాంటి ఘటనల్లో దేశంలోనే ముందుంది. నవజాత శిశువుల్ని రోడ్డున పడేస్తున్న కేసులు అక్కడే ఎక్కువగా నమోదవుతున్నాయని ఎన్‌సీఆర్‌బీ(జాతీయ నేర గణాంకాలు) నివేదికలు చెబుతున్నాయి.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)