Madhya Pradesh: మొహర్రం ఊరేగింపులో ఉద్రిక్తత.. 16 మందిపై కేసు నమోదు

Published on Mon, 07/07/2025 - 08:47

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో  మొహర్రం ఊరేగింపు సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. జిల్లా అధికారులు ఊరేగింపునకు అనుమతించిన మార్గంలో కాకుండా,  నిషేధించిన మార్గంలో ఊరేగింపు నిర్వహించేందుకు కొందరు ప్రయత్నించిన దరిమిలా గందరగోళం నెలకొంది. పోలీసులు అక్కడ గుమిగూడిన జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో.. ఊరేగింపు సమయంలో సింబాలిక్ గుర్రాన్ని తీసుకెళ్తున్నప్పుడు కొందరు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో పోలీసులు అల్లరి మూకను చెదరగొట్టడానికి ప్రయత్నించారు. దీంతో ఇమామ్ హుస్సేన్ సమాధి ప్రతిరూపమైన తాజియాను మోస్తున్న వారితో సహా పలువురు గుర్రాన్ని సంఘటనా స్థలంలోనే వదిలి పారిపోయారు. ఈ ఘటన గురించి ఒక సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు ఒక నిర్వాహకునితో సహా 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఇతరులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.  
 

ఈ ఘటనకు మందు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పోలీసుల అధికారిక అనుమతి లేకుండా మొహర్రం ఊరేగింపులో పాల్గొన్నారనే ఆరోపణలతో 22 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఊరేగింపు స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసిందని, స్థానిక వ్యాపారుల నుండి నిరసనలు వ్యక్తమయ్యాయని, స్వల్ప ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు. అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు. వ్యాపారుల సమిష్టి ఫిర్యాదు ఆధారంగా ఊరేగింపు నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)