Breaking News

దాడిని తీవ్రంగా ఖండించిన అరబ్‌ దేశాలు

Published on Fri, 04/25/2025 - 05:38

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రమూకలు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉదంతాన్ని ఇరాక్, జోర్డాన్, ఖతార్‌ తదితర అరబ్‌ దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు సంఘీభావం ప్రకటించిన ఈ దేశాలు, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి. యూరప్‌ దేశాల సమాఖ్య ఈయూ కూడా దారుణాన్ని ఖండించింది. భారత్‌కు సంఘీభావం తెలిపింది. లక్ష్యమేదైనా, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందరూ ఖండించాల్సిందేనని స్పష్టం చేసింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

 దేశ భద్రత, స్థిరత్వానికి భంగం కలిగించే ఇటువంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అదేవిధంగా, పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని మోదీకి గురువారం ఇటలీ ప్రధానమంత్రి మెలోనీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. మృతుల కుటుంబాలకు వారు సానుభూతి తెలిపారు. అమాయకులను దారుణంగా పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల పైశాచికాన్ని వారు తీవ్రంగా ఖండించారు. మెలోనీ, మాక్రాన్‌లకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారని, దాడికి కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పారని విదేశాంగ శాఖ తెలిపింది. 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు