Breaking News

గోవా అగ్నిప్రమాదం: పోలీసుల ఉచ్చులో లూథ్రా బ్రదర్స్‌

Published on Thu, 12/11/2025 - 09:49

గోవా: ఇటీవల గోవాలోని నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రా సోదరులపై గోవా పోలీసులు ఉచ్చు బిగించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే దేశం విడిచి థాయిలాండ్‌కు పారిపోయిన లూథ్రా బ్రదర్స్ పాస్‌పోర్ట్‌లను పోలీసులు సస్పెండ్ చేశారు. 1967 పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 10A నిబంధనల ప్రకారం విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఈ చర్యకు మద్దతు పలికింది. దీంతో లూథ్రా బ్రదర్స్ విదేశాలకు ప్రయాణించకుండా అడ్డుకట్ట పడింది.

లూథ్రా సోదరులు డిసెంబర్ 7న తెల్లవారుజామున 1:17 గంటలకు వారు మేక్‌మైట్రిప్ (ఎంఎంటీ)లో లాగిన్ అయ్యి విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఇమ్మిగ్రేషన్ రికార్డుల ప్రకారం ఇద్దరూ అదే రోజు ఉదయం 5:30 గంటలకు ఇండిగో విమానం 6ఈ 1073లో ఢిల్లీ నుండి నేరుగా థాయిలాండ్‌కు  వెళ్లిపోయారని వెల్లడయ్యింది. ఈ దుర్ఘటనలో మరణించిన 25 మందిలో 20 మంది క్లబ్ సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు ఉన్నారు.

ప్రస్తుతం థాయిలాండ్‌లోని ఫుకెట్‌లో తలదాచుకున్న లూథ్రా సోదరులు  లుక్-అవుట్ నోటీసులు, ఇంటర్‌పోల్ బ్లూ కార్నర్ నోటీసును ఎదుర్కొంటున్నారు.  ఇంతలో గోవా పోలీసులు నైట్‌క్లబ్ యజమానులలో ఒకరైన అజయ్ గుప్తాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ తాను లూథ్రాలతో కేవలం స్లీపింగ్ పార్టనర్‌ను మాత్రమేనని తెలిపారు. కాగా క్రిమినల్ కేసుల్లో నిందితులు దేశం విడిచి పారిపోకుండా నిరోధించేందుకు పాస్‌పోర్ట్‌లు సస్పెండ్ చేస్తారు. వీటిని తిరిగి యాక్టివేట్‌ చేయడానికి చట్టపరమైన విధానాలు అనుసరించాల్సి ఉంటుంది.

ఈ కేసుపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్రంగా స్పందించారు. నిందితులను ఎంతమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎన్‌డిటివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సావంత్ మాట్లాడుతూ ‘అది థాయ్‌లాండ్ అయినా లేదా మరే ఇతర ప్రదేశమైనా సరే, మేము వారిని అక్కడి నుండి పట్టుకొచ్చి జైల్లో పెడతాం’ అని  స్పష్టంగా ప్రకటించారు.

ఇకపై బాణసంచాకు శాశ్వత నిషేధం
గోవాలోని అర్పోరా నైట్‌క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దరిమిలా ఉత్తర గోవా పరిపాలనా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా  ఉండేందుకు ఇక్కడి నైట్‌క్లబ్‌లు, హోటళ్లు, ఇతర పర్యాటక ప్రాంతాలలో బాణసంచా కాల్చడాన్ని  నిషేధించారు. ఈ అగ్నిప్రమాదంలో 20 మంది సిబ్బంది, ఐదుగురు పర్యాటకులు సహా మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రాథమిక దర్యాప్తులో నైట్‌క్లబ్ లోపల నృత్య ప్రదర్శన సందర్భంగా విద్యుత్ బాణసంచా (పైరోటెక్నిక్స్) ఉపయోగించడం వల్లే మంటలు చెలరేగాయని వెల్లడయ్యింది. ఈ తాజా నిషేధం ద్వారా ఈ రకమైన ప్రమాదకర ప్రదర్శనలకు అడ్డుకట్ట వేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు బాధ్యులైన క్లబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఐదుగురు మేనేజర్లు,సిబ్బందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పారిపోయిన క్లబ్‌ యజమానుల కోసం గాలింపు కొనసాగుతోంది. 


ఇది కూడా చదవండి: Year Ender 2025: ఇడ్లీ విప్లవం.. ఉగాది పచ్చడికి పట్టం!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)