Breaking News

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రహోదా తీర్మానానికి ఎల్జీ ఓకే

Published on Sun, 10/20/2024 - 05:13

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ ఒమర్‌ అబ్దుల్లా కేబినెట్‌ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఆమోదముద్రవేశారు. గురువారం సమావేశమై కేబినెట్‌ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌ ప్రజల గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కులను తిరిగి పొందేందుకు పాత గాయాలను మాన్పే పూర్తిరాష్ట్ర హోదా పొందే ప్రక్రియలో ఈ తీర్మానం తొలి అడుగు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

 జమ్మూకశ్మీరీల ప్రత్యేక గుర్తింపే నూతన ప్రభుత్వం అనుసరించనున్న విధాననిర్ణయాలకు భూమిక అని ఆయన అన్నారు. నవంబర్‌ నాలుగోతేదీన అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఒమర్‌ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రద్దయిన 370 ఆరి్టకల్‌ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తీర్మానాలు జరగకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కొలువుతీరిన కొద్దిరోజులకే ఒమర్‌ సర్కార్‌ అప్పుడే కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి.

Videos

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Kurnool: SV మోహన్ రెడ్డి తనయుడి రిసెప్షన్ కు హాజరైన YS జగన్

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

DSC స్కామ్ బట్టబయలు లోకేష్ కి ఇచ్చిపడేసిన వరుదు కళ్యాణి

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ఎంత పెరిగిందంటే..!

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)