Breaking News

సుశీల్ మోదీ లవ్‌ స్టోరీ.. రైలులో మొదలై..

Published on Tue, 05/14/2024 - 11:03

బీహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ క్యాన్సర్‌కు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన సుశీల్‌ మోదీ జీవితంలో అనేక మరపురాని ఘట్టాలు ఉన్నాయి. వాటిలో ఒకటే ఆయన లవ్‌ స్టోరీ. తొలి చూపులోనే జెస్సీతో ప్రేమలో పడిన ఆయన దానిని పెళ్లి వరకూ ఎలా తీసుకువెళ్లారంటే..

సుశీల్‌ మోదీ, జెస్సీ జార్జ్‌ల ప్రేమ కథ సినిమాను తలపిస్తుంది. రైలు ప్రయాణంలో తొలిసారిగా సుశీల్ మోదీ, జెస్సీ జార్జ్ ఒకరినొకరు చూసుకున్నారు. తరువాత మాట్లాడుకున్నారు. తరువాతి కాలంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. కలిసి జీవించాలనుకుని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారుంటున్న పరిస్థితుల్లో వారికి  సంప్రదాయాల అడ్డుగోడ దాటడం చాలా కష్టంగా మారింది.

ఆ సమయంలో సుశీల్ మోదీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో సభ్యునిగా ఉండేవారు. అయితే జెస్సీ జార్జ్‌ రాజకీయాలకు దూరంగా మెలిగేవారు. ఆమె కేరళలోని ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు. దీంతో విరిద్దరి మధ్య భాషతో పాటు మతపరమైన అడ్డంకి కూడా ఉంది. అయినా సుశీల్ మోదీ జెస్సీ జార్జ్‌ల ప్రేమ కథ విజయవంతంగా ముందుకు సాగింది.

40 ఏళ్ల క్రితం నాటి వీరి ప్రేమ కథ గురించి సుశీల్ మోదీ స్నేహితుడు సరయూ రాయ్ ఒకప్పుడు మీడియాకు తెలిపారు. విద్యార్థి పరిషత్ పనుల మీద సుశీల్ తరచూ రైలు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో ఆయన జెస్సీని రైలులో కలుసుకున్నారు. తరువాత వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రేమ గురించి ఇరు కుటుంబాల సభ్యులకు తెలియగానే వారు కోపంతో రగిలిపోయారు. అయితే ఆ జంట తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

చివరికి పెద్దలు ఒప్పుకోవడంతో సుశీల్‌ మోదీ, జెస్సీలు  1987లో వివాహం చేసుకున్నారు. నాడు బీజేపీ నేత అటల్ బిహారీ వాజ్‌పేయి వారి వివాహానికి హాజరయ్యారు.  ఇది జరిగిన మూడేళ్ల తర్వాత 1990లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాటి ఎన్నికల్లో సుశీల్‌ మోదీ గెలుపొందారు. సుశీల్‌ మోదీ రాజకీయాల్లో కొనసాగగా, జెస్సీ జార్జ్ మోదీ లెక్చరర్‌గా పనిచేశారు. 

Videos

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)