Breaking News

కర్ణాటక: అల్లుని ఇంటిపై...

Published on Mon, 02/23/2026 - 09:00

మండ్య( కర్ణాటక): యువతి ప్రేమించి పెళ్లి చేసుకోగా ఆమె తండ్రి రౌద్రరూప దాల్చాడు, అల్లుని ఇంటికి నిప్పంటించిన సంఘటన మండ్య తాలూకాలోని చుంచగహళ్లి గ్రామంలో శనివారం జరిగింది. వివరాలు.. అదే గ్రామంలో ఒకే వీధిలో నివసించే చెందిన వినోద్, కావ్య ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకే కులం. కానీ యువతి తండ్రి చన్నేగౌడకు ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదు. నవంబర్‌ 19న ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకుని దగ్గర్లోనే ఓ చోట కాపురం పెట్టారు.  

డబ్బు, బంగారం బూడిద.. 
కుమార్తె, అల్లుడు ఏ ఇంటిలో ఉన్నారో తెలుసుకున్న మామ చన్నేగౌడ శనివారం ఉదయం వెళ్లి ఇంటిలోకి పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో దంపతులు లేరు. మంటలు  వ్యాపించి, ఇంట్లో ఉన్న వస్తువులు, ఫరి్నచర్, టీవీ తదితరాలు కాలిపోయాయి. ఇల్లు పూర్తిగా దెబ్బతినింది. ఇంట్లోని రూ.10 లక్షల నగదు, 250 గ్రాముల బంగారం కూడా కాలిపోయినట్లు వినోద్‌ కుటుంబీకులు విలపించారు. ఈ సమయంలో చన్నేగౌడ కూడా గాయపడ్డాడు, అతనిని చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఫైర్‌ సిబ్బంది, పోలీసులు, క్లూస్‌ టీం చేరుకుని ఆధారాలను సేకరించారు. డీఎస్పీ యశ్వంత్‌ కుమార్, సీఐ నవీన్‌ కేసు నమోదు చేశారు. భార్యాభర్తలను మద్దూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తర్వాత యువతి కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)