Breaking News

ముంబైలో శంకర్‌ మహదేవన్‌ కొత్త రెస్టారెంట్‌ ప్రత్యేకతలివే!

Published on Tue, 12/02/2025 - 12:44

సాక్షి, ముంబై: అద్భుతమైన గొంతుతో సంగీత ప్రియుల్ని ఉర్రూత లూగించిన సంగీత దిగ్గజం , గాయకుడు శంకర్ మహదేవన్ తన విభిన్నమైన రుచులు, దక్షిణ భారత వంటకాలతో ఆహార ప్రియుల్ని ఆకట్టు కుంటున్నారు. ముంబైలో   శంకర్ మహదేవన్ రెస్టో-కేఫ్ ‘మాల్గుడి రెస్టారెంట్’  సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌ను ముంబైలో స్పెషల్‌గా ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది. 

ముంబై నగరం దక్షిణ భారత ఆహారాన్నిబాగా ఇష్టపడతారు.  క్లాసిక్ ఫిల్టర్ కాఫీ, మెత్తని ఇడ్లీలు, రకరకాల దోసెలు -స్టైల్ దోసెలు  ఇవి నగరానికి  స్పెషల్‌ ఆకర్షణ . ఈ నేపథ్యంలో  శంకర్‌ మహదేవన్‌  ఫుడ్‌ బిజినెస్‌లో ఎంట్రీ  ఇచ్చారు. ఈ రెస్టారెంట్ల చెయిన్‌ పేరు మాల్గుడి డేస్‌.  ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్.కె. నారాయణ్ రాసిన "మాల్గుడి డేస్" అనే పుస్తకమే దీని ప్రేరణ. ప్రస్తుతం బోరివాలీలో ఒక రెస్టారెంట్ ప్రారంభం కాగా, చెంబూర్‌లో సౌత్ ఇండియన్, శంకర్ మహదేవన్, కొత్త అవుట్‌లెట్, ఫ్యామిలీ డైనింగ్, రెస్టో కేఫ్, ప్యూర్ వెజ్ తాజాగా అందుబాటులోకి వచ్చింది.  ఇది ఉదయం  11 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకు అందుబాటులో ఉంది. ఇద్దరికి సుమారు రూ.850 ఖర్చవుతుంది. 

 

శంకర్ మహదేవన్, కె. ఎస్. రామకృష్ణన్ సహభాగస్వామ్యంతో ఈటోపియా హోల్డింగ్స్ మధ్య సహకారంతో మాల్గుడి రూపు దిద్దుకుంది. వచ్చే ఏడాది 2026లో  దుబాయ్‌లో కూడా  మాల్గుడి రెస్టారెంట్   బ్రాంచ్‌ ఓపెన్‌ కానుంది. ఈ రెస్టారెంట్‌ను ఇంటీరియన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం విశేషం. ఇండిగో, టెర్రకోట రంగులు, ఇత్తడి లైటింగ్,  కేన్‌ కుర్చీలు, టేకు టేబుళ్లతో పాటు, తీరప్రాంత గృహాలు, టెంపుల్‌ టౌన్స్‌ ప్రతిబింబించేలా ఉంటాయి. హ్యాండ్‌ పెయింటింగ్స్‌, చెట్టినాడ్-శైలిటైల్‌వర్క్, ఓపెన్ కిచెన్ లాంటివాటితో డైనమిక్ లుక్‌తో ఆకట్టుకుంటోంది.

మాల్గుడి రెస్టారెంట్: ఫుడ్ మెనూ
కమ్మని వాసనతో సాంప్రదాయ ఫిల్టర్ కాఫీతో పాటు ఆధునికి కాపుచినో వెరైటీస్‌ కూడా  ఇక్కడ  ఉంటాయి. శతాబ్దాల నాటి వంటకం  ముల్బాగల్ లెగసీ  నేతి దోస ఒక సిగ్నేచర్ ఆఫర్. ఇది  ప్లెయిన్, మసాలా, చీజ్ మరియు చీజ్ మసాలా వైవిధ్యాలలో లభిస్తుంది. పోడి చీజ్ బాల్స్, అన్నా స్టైల్ క్రిస్పీ లోటస్ రూట్ ,బట్టర్ పెప్పర్ గార్లిక్ వాటర్ చెస్ట్‌నట్‌, కాకిస్ షీరా లభిస్తాయి. ఇంకా శంకర్‌ మహదేవన్‌కు ఎంతో ఇష్టమైన  క్రీమీ శ్రీలంక తమిళ కర్రీని ఇడియప్పం ఉంటాయి. బిసి బెలే బిబింబాప్, పనీర్ నెయ్యి రోస్ట్ విత్ నీర్ దోస, వెన్ పొంగల్ అరన్సిని ,ఎలానీర్ పాయసం ఇలా ఎన్నో రుచులను ఇక్కడ ఆస్వాదించవచ్చు. 

ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు