Breaking News

సిబ్బందితో ప్యాసింజర్‌ గొడవ.. విమానం గాల్లో ఉండగానే వెనక్కి..

Published on Mon, 04/10/2023 - 11:35

న్యూఢిల్లీ: సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు రచ్చ రచ్చ చేశాడు. ఫ్లయిట్ గాల్లో ఉండగా సిబ్బందితో గొడవకు దిగాడు. వాళ్లతో ఫైట్ చేశాడు. దీంతో వెంటనే  విమానాన్ని వెనక్కి మళ్లించాడు పైలట్. తిరిగి ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు.

అనంతరం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి ప్రయాణానికి అంతరాయం కల్గించిన ప్యాసింజర్‌ను కిందకు దింపేశారు. అతనిపై ఫిర్యాదు చేసి విమానాశ్రయంలోని పోలీసులకు అప్పగించారు.  ఆ తర్వాత విమానం మళ్లీ లండన్ బయల్దేరి వెళ్లింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా నిర్వాహకులు అధికారకంగా స్పందించాల్సి ఉంది. ప్యాసింజర్‌ సిబ్బందితో ఎందుకు గొడవపడ్డాడనే విషయం తెలియాల్సి ఉంది.

కాగా.. ఇటీవలి కాలంలో కొందరు ప్రయాణికులు విమానాల్లో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఓ ప్యాసింజర్ తప్పతాగి తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఘటనలో ఓ ప్యాసింజర్ విమానంలో స్మోకింగ్ చేసి హల్ చల్ చేశాడు. మరో ఘటనలో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు తోటి ప్యాసింజర్లతో గొడవకు దిగి నానా హంగామా చేశాడు.
చదవండి: Corona Virus: జాగ్రత్త! కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయ్‌..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)