24 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

Published on Wed, 06/12/2024 - 03:28

సాక్షి, న్యూఢిల్లీ:  పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 24 నుంచి జూలై 3వ తేదీ వరకూ జరుగనున్నాయి. కేంద్రంలో నూతన ప్రభుత్వం కొలువుదీరడంతో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించడానికి స్పీకర్‌ను ఎంపిక చేయడంతోపాటు నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ప్రత్యేక సమావేశాల్లో తొలి రెండు రోజులు సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్‌ సభ్యుడు కొడికొన్నిల్‌ సురేశ్‌ వ్యవహరించనున్నట్లు సమాచారం.

లోక్‌సభలో ప్రొటెం స్పీకర్‌గా సీనియర్‌ సభ్యుడు వ్యవహరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి లోక్‌సభకు ఎన్నికైన వారిలో కొడికున్నిల్‌ సురేశ్, గత సమావేశాల్లో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన వీరేంద్రకుమార్‌ ఖతిక్‌(బీజేపీ) ఎనిమిదేసి పర్యాయాలు ఎంపీలుగా నెగ్గారు. వీరేంద్రకుమార్‌ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కారణంగా కొడికున్నిల్‌ సురేశ్‌కు ప్రొటెం స్పీకర్‌గా అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది.

సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్‌ ఎంపిక జరుగనుంది.  ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జేడీ(యూల) లోక్‌సభ సభాపతి పదవి కోసం పట్టుపడుతున్నప్పటికీ ఆ స్థానానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ అందుకు అంగీకరించడం లేదు. స్పీకర్‌ పోస్టును వదులుకోబోమని చెబుతోంది. గత సమావేశాలకు సభాపతిగా పనిచేసిన ఓం బిర్లాతోపాటు పలువురి పేర్లను బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. మరోవైపు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వస్తున్నాయి.

Videos

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

దులీప్ ట్రోపి ఫైనల్ నుండి వైభవ్ అవుట్?

నన్ను టార్గెట్ చేస్తే.. ఎమ్మెల్యేలకు కొండా హెచ్చరిక

Garam Garam : బావిపై వేలాడిన ఆర్టీసీ బస్సు

విజయవాడలో హైటెన్షన్ విద్యా భవన్ ముట్టడి

Photos

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)