Breaking News

అమిత్‌ షా ఎంట్రీతో ‘మహా’ పంచాయితీ కొలిక్కి

Published on Wed, 03/13/2024 - 09:34

సాక్షి, ముంబై : ఇకపై బలాబలాలు నిరూపించుకోవడాల్లేవ్‌..ఎన్నికల బరిలోకి దిగి మెజార్టీ స్థానాల్లో గెలవడమే తరువాయి అంటూ మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌పవార్‌ వర్గం) కూటమి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇన్ని రోజులు సీట్ల పంపకంలో నాన్చుతూ వస్తున్న అంశాన్ని ట్రబుల్‌ షూటర్‌ అమిత్‌ షా యూటర్న్‌ తిప్పారు. చర్చలు సఫలం కావడంతో కూటమిలో ఇతర భాగస్వాములు ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారనేది త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు.  

రోజుల తరబడి సాగిన చర్చల తర్వాత, మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం పురోగతి సాధించింది. ఎన్సీపీ- అజిత్‌ పవార్‌ వర్గం నాలుగు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.  

మహరాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉండగా.. తమకు క్షేత్రస్థాలు బలం ఎక్కువగా ఉందంటూ ఎన్సీపీ- అజిత్‌ పవార్‌ వర్గం 11 స్థానాలు, శివసేన-ఏక్‌ నాథ్‌ షిండే వర్గం 22 స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుబట్టాయి.

అయితే షిండే వర్గానికి 22 సీట్లు, అజిత్‌పవార్‌కు 11 సీట్లు కేటాయిస్తే మాకు మిగిలేదేంటి? 48 సీట్లలో 15 సీట్లా? అది ఎలా సాధ్యపడుతుంది’ అని బీజేపీ నేతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సీట్ల పంపకంపై పలు దఫాలుగా చర్చలు జరిగినా.. అవి కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో  బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రంగంలో దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టారు. 

తాజాగా, ఎన్సీపీ- అజిత్‌ పవార్‌ వర్గం బారామతి, రాయ్‌గఢ్, షిరూర్, పర్భాని.. ఈ నాలుగు లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు అంగీకరించింది.  ఇక శివసేన ఏక్‌నాథ్‌ షిండే వర్గం 13 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా, ఆయా స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక? ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారనే అంశాలపై మహాయుతి కూటమి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)