Breaking News

శిబూ సోరెన్‌కు నివాళులు.. లోక్ సభ మ.2 గంటలకి వాయిదా

Published on Mon, 08/04/2025 - 11:46

ఢిల్లీ: ప్రతిపక్షాల గందరగోళం మధ్య లోక్‌సభ సమావేశాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు  ముందుకు సాగలేదు. బీహార్ ప్రత్యేక ఓటరు సవరణపై చర్చ జరపాలని విపక్షాల పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. దీనికి సమాధానంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు నిబంధనలను గుర్తు చేస్తూ ఈ అంశంపై చర్చించలేమని అన్నారు.

దీనికి ముందు ఇండియా బ్లాక్  నేతలు బీహార్ ప్రత్యేక ఓటరు సవరణ నిరసన వ్యక్తం చేశారు, ప్రభుత్వం దీనిపై ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఇప్పటివరకు పెద్దగా పురోగతి సాధించిందే లేదు. ఇండియా బ్లాక్ నిరసనలతో అంతరాయం కలుగుతోంది.

లోక్‌సభలో వర్షాకాల సమావేశాలు సోమవారం గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి.  ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే, ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఈ గందరగోళం కారణంగా సభా కార్యకలాపాలు ముందుకు కొనసాగలేదు. స్పీకర్ ఓం బిర్లా ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను వారి స్థానాలకు వెళ్లి, ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగనివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే వారు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ గందరగోళం కారణంగా సభ ప్రారంభమైన 10 నిమిషాలకే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. 
 

ఇక నేటి రాజ్యసభ కార్యకలాపాల విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ శిబు సోరెన్ మృతిపై సభలో సభ్యులంతా సంతాపం వ్యక్తం చేశారు. తరువాత ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. తమ కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా, ఆగస్టు 8 ఉదయం ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ప్రతిపక్షాలు మార్చ్ నిర్వహించనున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో పార్లమెంటు సభ్యుడు, జార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్‌ కన్నుమూశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)