Breaking News

Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’

Published on Tue, 05/07/2024 - 05:39

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సొంత లోక్‌సభ స్థానం గుల్బర్గాలో బీజేపీ నుంచి మరోసారి గట్టి సవాలు ఎదురవుతుతోంది. కాంగ్రెస్‌ కంచుకోటగా పేరుగాంచిన గుల్బర్గాలో 2009, 2014ల్లో వరుసగా నెగ్గిన ఖర్గే 2019లో బీజేపీ అభ్యర్థి ఉమేశ్‌ జాదవ్‌ చేతిలో ఖర్గే ఓటమి చవిచూసి హ్యాట్రిక్‌కు దూరమయ్యారు. ఈసారి కాంగ్రెస్‌ నుంచి ఖర్గే అల్లుడు రాధాకృష్ణ దొడ్డమణిని బరిలో ఉన్నారు.

 బీజేపీ నుంచి మరోసారి ఉమేశ్‌ జాదవ్‌ పోటీ చేస్తున్నారు. కలబురిగికి చెందిన దొడ్డమణికి పలు విద్యాసంస్థలున్నాయి. ఇంతకాలం ఖర్గే ఎన్నికల ప్రచారం, వ్యూహరచన తదితరాల్లో తెర వెనక దన్నుగా ఉన్నారు. వైద్యుడైన ఉమేశ్‌ పూర్వాశ్రమంలో కాంగ్రెస్‌ నాయకుడే. 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీదర్‌లోని చించోలి నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 

ఖర్గేతో విభేదాల కారణంగా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. తన గురుతుల్యుడైన ఖర్గేపైనే గెలుపొందారు. గుల్బర్గాలోలో 65 శాతం కంటే ఎక్కువ గ్రామీణ ఓటర్లే. మొత్తమ్మీద 20 శాతం మంది ముస్లిం ఓటర్లు, 24 శాతానికి పైగా దళితులున్నారు. వీరి ఓట్లపై కాంగ్రెస్‌ నమ్మకం పెట్టుకుంది. గుల్బర్గా లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ కేవలం మూడుసార్లు మాత్రమే ఓడింది. బీజేపీ రెండుసార్లు మాత్రమే గెలిచింది. మూడో విడతలో భాగంగా మంగళవారం ఇక్కడ పోలింగ్‌ జరుగనుంది.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)