Breaking News

Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!

Published on Sat, 04/27/2024 - 01:40

మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్‌ స్టేషన్‌ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. 
 

కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వదార్‌పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్‌ను పోలింగ్‌ స్టేషన్‌ ముందు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్‌ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.

‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్‌ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్‌ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్‌ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువు
ఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో!               

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)