Breaking News

ఇండియా కూటమి చెదరలేదు: జైరామ్‌ రమేశ్‌

Published on Mon, 03/25/2024 - 05:31

న్యూఢిల్లీ:  ప్రతిపక్ష ఇండియా కూటమి చెక్కుచెదరలేదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ స్పష్టం చేశారు. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్, పశి్చమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నప్పటికీ తమ కూటమికి స్థిరంగా, బలంగా ఉందని అన్నారు. అవినీతిని వ్యతిరేకిస్తున్నాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న ప్రకటనలన్నీ ఉత్తడొల్లేనని కొట్టిపారేశారు.

జైరామ్‌ రమేశ్‌ ఆదివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని తేల్చిచెప్పారు. విపక్షాలు 272కి పైగా సీట్లు సాధిస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు పొందినవారు పెద్ద ఎత్తున ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసి, బీజేపీకి సమర్పించుకున్నారని తెలిపారు. రూ.4,000 కోట్ల విలువైన బాండ్లకు రూ.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులతో ప్రత్యక్షంగా సంబంధం ఉందన్నారు.

ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా ఎలక్టోరల్‌ బాండ్లు కొనుగోలు చేసి బీజేపీకి అందజేశారని వెల్లడించారు. ఇది ముమ్మాటికీ క్విడ్‌ ప్రో కో అని తేలి్చచెప్పారు. మౌలిక సదుపాయాలకు సంబంధించిన కాంట్రాక్టులను దక్కించుకున్న ఓ బీజేపీ ఎంపీ కూడా ఎలక్టోరల్‌ బాండ్లు కొన్నాడని వెల్లడించారు అవినీతిపై పోరాటం అంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటల్లో ఏమాత్రం పస లేదని జైరామ్‌ రమేశ్‌ స్పష్టం చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)