Breaking News

Lok sabha elections 2024: వావ్‌! గెనీబెన్‌!!

Published on Fri, 05/03/2024 - 05:00

గెనీబెన్‌ నాగాజీ ఠాకోర్‌. ఉత్తర గుజరాత్‌లో కాంగ్రెస్‌ ప్రముఖ నేతల్లో ఒకరు. అసెంబ్లీలో పారీ్టకి బలమైన గొంతుక. సభలో ధాటైన ప్రసంగాలతో ఆకట్టుకుంటారు. క్షేత్రస్థాయిలో బలమైన పునాది కలిగిన ప్రజాప్రతినిధి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా నడుమ కూడా వావ్‌ స్థానం నుంచి విజయం సాధించారు. తన నియోజకవర్గంలో అందరినీ పేరుపేరునా పలకరించే నాయకురాలు. ఎవరింట్లో ఎలాంటి కార్యక్రమమైనా తప్పనిసరిగా హాజరవుతారు. బనస్కాంత లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగి బీజేపీకి గట్టి సవాలే విసురుతున్నారు... 

పంచాయతీ నుంచి... 
2017 అసెంబ్లీ ఎన్నికలు గెనీబెన్‌ రాజకీయ జీవితంలో కీలక మలుపు. వావ్‌ నుంచి బీజేపీ సీనియర్‌ నేత, మంత్రి శంకర్‌ చౌదరీని ఓడించడంతో ఆమె పేరు రాష్ట్రమంతటా మారుమోగిపోయింది. ఆమెకు కేవలం రెండో ఎన్నికలవి. జైన్‌ విశ్వభారతి ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పొలిటికల్‌ సైన్స్‌ చదువుతూ గ్రాడ్యుయేషన్‌ మధ్యలోనే వదిలేశారు. పంచాయతీ సభ్యురాలిగా చేశారు. 2012లో కాంగ్రెస్‌ వావ్‌ నుంచి టికెటిచి్చంది. అప్పుడు 12వేల ఓట్లతో ఓడినా 2017లో విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన ముగ్గురు మహిళల్లో ఒకరు.

క్రౌడ్‌ ఫండింగ్‌తో నిధుల సేకరణ... 
బనస్కాంత జిల్లాలో అన్ని సామాజికవర్గాల వారూ తనను సోదరిగా భావిస్తారంటారు గెనీబెన్‌. ఎన్నికల ఖర్చు కోసం నియోజకవర్గంలో క్యూ ఆర్‌ కోడ్‌ను క్రియేట్‌ చేసి మరీ క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. ‘‘బీజేపీకి బలమైన ఆర్థిక వనరులున్నాయి. నాకున్నది విలువలు, సామాజిక సూత్రాలే. అయినా బలమైన సిద్ధాంతంతో పోరాడేవారిని ఎవరూ ఓడించలేరు. కనుక దేశంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం ఫరిడవిల్లడానికి తోచిన సాయం చేయండి’’ అని ప్రజలను కోరుతున్నారు. రాజస్తాన్, పాకిస్తాన్‌తో సరిహద్దులో ఉన్న లోక్‌సభ స్థానం బనస్కాంత. ‘సీమ దర్శన్‌’ పేరుతో ఇక్కడ సరిహద్దు పర్యాటక స్థలం కూడా ఉంది. ఇక్కడ ఠాకోర్‌ ఓటర్లు 18 శాతం, చౌదరి ఓటర్లు 13 శాతం ఉన్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు... 
కులాంతర, మతాంత వివాహాలను నిషేధిస్తు ఠాకోర్‌ సామాజికవర్గం తీసుకున్న నిర్ణయాన్ని గెనీబెన్‌ సమరి్థంచడం వివాదం రేపింది. యువతులకు మొబైల్‌ఫోన్లను నిషేధించడాన్ని కూడా ఆమె సమరి్థంచారు. ‘‘బాలికలకు మొబైల్‌ఫోన్లను నిషేధించడంలో తప్పు లేదు. మొబైల్స్‌కు దూరంగా 
ఉండి బాగా చదువుకోవాలి’’ అని సూచించడంపై చాలా విమర్శలే వచ్చాయి.  
 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)