Breaking News

Lok Sabha elections 2024: గౌతమ్‌ గంభీర్‌ అస్త్ర సన్యాసం

Published on Sun, 03/03/2024 - 05:57

న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ నియోజకవర్గం ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ సంకేతాలిచ్చారు. క్రికెట్‌కు సంబంధించిన కార్యక్రమాల్లో బిజీ కానున్నందున తనను రాజకీయ బాధ్యతల నుంచి తప్పించాలంటూ శనివారం ఆయన బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. గంభీర్‌ శనివారం ‘ఎక్స్‌’లో.. ‘నాకు రాజకీయ బాధ్యతల నుంచి విరామం ఇవ్వాలంటూ గౌరవ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశాను.

దీనివల్ల రానున్న క్రికెట్‌ సీజన్‌లో ముందుగా ఒప్పుకున్న కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు వీలుంటుంది. ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన గౌరవ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా జీలకు కృతజ్ఞతలు’అని పేర్కొన్నారు. గంభీర్‌ను ఈసారి ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి మార్చొచ్చంటూ వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ బీజేపీ ఎంపీ జయంత్‌ సిన్హా కూడా గౌతమ్‌ గంభీర్‌ బాటలోనే నడుస్తున్నారు. తనకు క్రియాశీల రాజకీయాల నుంచి విముక్తి కల్పించాలంటూ పార్టీ చీఫ్‌ జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)