అమాయకుల ఇళ్లపైకే బుల్డోజర్లు

Published on Sun, 02/25/2024 - 05:25

లక్నో:  ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. బుల్డోజర్లతో అమాయక ప్రజల ఇళ్లను కూలి్చవేస్తున్నారని, ప్రభుత్వ నిర్వాకం వల్ల నేరగాళ్లు మాత్రం నిక్షేపంగా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఆమె శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో తన సోదరుడు రాహుల్‌ గాంధీతోపాటు భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయాయని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. రైతుల మొర ఆలకించే తీరిక పాలకులకు లేదా? అని నిలదీశారు.

ఉత్తరప్రదేశ్‌లో రైతులపైకి జీపులు నడిపించి చంపిన నాయకుల ఇళ్లపైకి, మహిళలను వేధించిన దుర్మార్గుల ఇళ్లపైకి, ప్రశ్నాపత్రాలను లీక్‌ చేసినవారి ఇళ్లపైకి బుల్డోజర్లు వెళ్లడం లేదని ధ్వజత్తారు. అమాయకుల ఇళ్లు మాత్రమే బల్డోజర్ల కింద నలిగిపోతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మహిళలు, చిన్నారులు, రైతులకు అన్యాయం జరుగుతుండడం వల్లే యాత్రలో ‘న్యాయ్‌’ పదాన్ని చేర్చామన్నారు. ఆదివారం ఆగ్రాలో యాత్రలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

ఆ పిల్లలు రీల్స్‌ చూడరు: రాహుల్‌
దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, ఇక యువత రోజుకు 12 గంటలు మొబైల్‌ ఫోన్లు చూడక ఏం చేస్తారని రాహుల్‌ ప్రశ్నించారు. ఆయన శనివారం యూపీలోని సంభాల్‌లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో మాట్లాడారు. రోజుకు ఎన్ని గంటలు ఫోన్‌ వాడుతున్నారని యువతను ప్రశ్నించగా 12 గంటలని బదులిచ్చారు. దాంతో రాహుల్‌ ఈ మేరకు స్పందించారు. సంపన్నులు, బడా వ్యాపారవేత్తల పిల్లలు ఫోన్లలో రీల్స్‌ చూడరని, రోజంతా డబ్బులు లెక్కపెట్టుకొనే పనిలోనే ఉంటారని అన్నారు.
శనివారం యూపీలోని మొరాదాబాద్‌లో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్, ప్రియాంక

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)