Breaking News

Lok Sabha elections 2024: రాజ్‌నాథ్‌ సారథ్యంలో మేనిఫెస్టో కమిటీ

Published on Sun, 03/31/2024 - 05:43

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మేనిఫెస్టో రూపకల్పనకు గాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సారథ్యంలో బీజేపీ 27 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కన్వీనర్‌గా, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌ కో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. పార్టీ ఎన్నికల హామీలపై ఈ కమిటీ మేధో మథనం చేయడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సూచనలను స్వీకరించనుంది.

ఇందులో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, కిరెన్‌ రిజిజు, అర్జున్‌ ముండా, అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్, స్మృతి ఇరానీ, రాజీవ్‌ చంద్ర శేఖర్‌ ఉన్నారు. బీజేపీ పాలిత గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్, అస్సాం సీఎం హిమాంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణు డియో సాయి కూడా కమిటీలో ఉన్నారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, వసుంధరా రాజే వంటి సీనియర్‌ నేతలకు కూడా బీజేపీ అధిష్టానం స్థానం కల్పించింది. క్రైస్తవులు, ముస్లింలకు ఆంటోనీ, మన్సూర్‌లు ప్రాతినిధ్యం వహించనున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్తాన్‌ సీఎం భజన్‌లాల్‌ శర్మ పేర్లు కమిటీలో లేవు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)