Breaking News

Lok Sabha Election 2024: పవార్‌ వర్సెస్‌ పాటిల్‌

Published on Mon, 05/13/2024 - 05:03

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ లోక్‌సభ స్థానం 2009 నుంచీ బీజేపీ కంచుకోట. అక్కడ ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్, రాధాకృష్ణ విఖే–పాటిల్‌ కుటుంబాల మధ్య ఇక్కడ చిరకాలంగా శత్రుత్వం కొనసాగుతోంది. 

ఈసారి విఖే పాటిల్‌ కొడుకు, సిట్టింగ్‌ ఎంపీ సుజయ్‌ మహాయుతి కూటమి తరఫున బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ ఎమ్మెల్యే నీలేశ్‌ లంకేను ఎన్సీపీ (ఎస్పీ) తరఫున పవార్‌ తొలిసారి లోక్‌సభ బరిలో నిలిపారు. కుమారున్ని ఎలాగైనా గెలిపించుకోవాలని రాధాకృష్ణ, అగాడీ మద్దతుతో లంకేను గట్టెక్కించి పైచేయి సాధించాలని పవార్‌ పట్టుదలతో ఉన్నారు. అహ్మద్‌నగర్‌లో నేడు పోలింగ్‌ జరుగుతోంది. 

సుజయ్‌కి ఈజీ కాదు
సుజయ్‌ ముత్తాత విఠల్‌రావు విఖే పాటిల్‌ దేశంలో తొలి చక్కెర సహకార కర్మాగారం స్థాపించారు. తండ్రి రాధాకృష్ణ ప్రస్తుత ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వంలో మంత్రి. 2019లో రాధాకృష్ణ బీజేపీలో చేరారు. అంతకు ముందు రెండు దశాబ్దాలు కాంగ్రెస్‌తో, అంతకుముందు శివసేనలో ఉన్నారు. 1995 నుంచి అహ్మద్‌నగర్‌ జిల్లాలోని షిర్డీ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాధాకృష్ణ తండ్రి బాలాసాహెబ్‌ విఖే పాటిల్‌  8 సార్లు ఎంపీగా చేశారు.

 వాజ్‌పేయి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. సుజయ్‌ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ నేత సంగ్రామ్‌ జగ్తాప్‌పై భారీ మెజారిటీతో నెగ్గారు. ఎన్సీపీలో చీలిక తర్వాత ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వర్గంతో కొనసాగుతున్న సంగ్రామ్‌ జగ్తాప్‌ ఈసారి సుజయ్‌ కోసం ప్రచారం చేస్తుండటం విశేషం. అజిత్‌ నుంచి ప్రధాని మోదీ దాకా అగ్ర నేతలు కూడా భారీ ర్యాలీలు నిర్వహించారు. అయినా ఈసారి సుజయ్‌ విజయం అంత తేలిక కాదంటున్నారు. 

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నపవార్‌..  
నీలేశ్‌ లంకే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్నర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ టికెట్‌పై గెలిచారు. 2023లో పార్టీ చీలిక తర్వాత అజిత్‌ వర్గంలోకి వెళ్లి తర్వాత శరద్‌ వర్గంలోకొచ్చారు. జిల్లా రాజకీయాలపై పట్టున్న ఆయన సుజయ్‌కి గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ ఎన్నికలను ధనబలం, ప్రజాబలం మధ్య పోరుగా అభివరి్ణస్తున్నారు. కరోనా వేళ ఉచిత చికిత్స ప్రజల మనసు గెలుచుకుంది.  సహకార నాయకుడు, కాంగ్రెస్‌∙మాజీ మంత్రి బాలాసాహెబ్‌ థోరట్‌ తదితరుల మద్దతు నీలేశ్‌కు కలిసి రానుంది. శరద్‌ పవార్‌ కూడా ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మక తీసుకుని సుడిగాలి ప్రచారం చేశారు. నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ వంటి స్థానిక సమస్యలపైనే నీలేశ్‌ తన ప్రచారాన్ని        కేంద్రీకరించారు.        

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)