Breaking News

Lok Sabha Election 2024: పెళ్లిపత్రికలోనూ ఈవీఎంపై వ్యతిరేకత!

Published on Mon, 05/27/2024 - 04:43

లాతూర్‌: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్‌ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు. 

మహారాష్ట్రలోని ఛాకూర్‌ తహసీల్‌ పరిధిలోని అజన్‌సోందా(ఖుర్ద్‌) గ్రామానికి చెందిన దీపక్‌ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్‌ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్‌ ఇని్వటేషన్‌ కార్డులో ప్రచురించాడు. 

తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్‌సెఫ్‌) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్‌ అయ్యారట! 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)