Breaking News

Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను

Published on Sat, 05/11/2024 - 06:31

కనౌజ్‌/కాన్పూర్‌: విపక్షాల ‘ఇండియా’ కూటమి తుపాను ఉత్తరప్రదేశ్‌లోకి దూసుకొస్తోందని ఈ ధాటికి మరోసారి మోదీ ప్రధాని కాలేరని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.  యూపీలో 80 స్థానాలకుగాను కనీసం 50 చోట్ల మా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్, కాన్పూర్‌లలో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్‌ మాట్లాడారు. ‘‘ దేశ ప్రధానిగా మోదీ మరోసారి పగ్గాలు చేపట్టలేరని లిఖితపూర్వక గ్యారెంటీగా భావించండి. ఇక అంతా అయిపోయింది. బీజేపీ ఓటమి ఖాయం.

 అందుకు అనుగుణంగానే విపక్షాల కూటమి చాన్నాళ్ల క్రితమే ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించింది. విద్వేష బజార్లలో ప్రేమ దుకాణాలను తెరిచాం. భారత్‌ జోడో యాత్ర, న్యాయయాత్ర చేశాం. దేశవ్యాప్తంగా విపక్షాల సమావేశాలు నిర్వహించాం’’ అని అన్నారు. పారిశ్రామికవేత్తలు అదానీ, అంబానీలతో కాంగ్రెస్‌ లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న మోదీ ఆరోపణలపై రాహుల్‌ స్పందించారు. ‘‘ ఓటర్లు పదేళ్ల నుంచి చూస్తున్నారు. ఒక్కసారైనా మోదీ అదానీ, అంబానీల పేరెత్తలేదు. కానీ ఇప్పుడు ఓటమి సుడిగుండం నుంచి కాపాడతారేమోనని వాళ్ల పేర్లు తొలిసారిగా ప్రస్తావిస్తున్నారు. ఓడిపోతున్నాను.. కాపాడండి అదానీ, అంబానీజీ అంటూ మోదీ ప్రాథేయపడుతున్నారు’’ అని రాహుల్‌ వెటకారంగా మాట్లాడారు.  

మోదీకి టెంపో బాగా తెలుసు 
టెంపోల నిండా అదానీ, అంబానీల నుంచి నగదు మూటలు వచ్చినందుకేæ కాంగ్రెస్‌ నోరుమూసుకుందని మోదీ అనడంపై రాహుల్‌.. ‘‘ అంటే మోదీకి తరచూ అదానీ డబ్బులను టెంపోలో పంపిస్తారన్నమాట. ఏ రకం టెంపోలో డబ్బులు పంపిస్తారో ఆయనకు బాగా తెలుసు. టెంపోల గురించి మోదీకి బాగా అవగాహన ఉన్నట్లుంది’’ అని అన్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)