ఘోర ప్రమాదం.. ఎమ్మెల్యే కారు ఢీకొని వ్యక్తి మృతి

Published on Fri, 05/05/2023 - 10:48

లక్నో: పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి కాన్వాయ్‌లోని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని పుర్భా మేదినీపూర్‌ జిల్లాలోని చందీపూర్‌లో గురువారం రాత్రి జరిగింది. పెట్రోల్‌బంక్‌ వద్ద సీక్‌ ఇస్రాఫిల్‌ అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా కారు ఢికొట్టిన్నట్లు ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు తెలిపారు. అంతేగాక ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు ఆపకుండా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. 

కాగా రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు నందిగ్రామ్‌ ఎమ్మెల్యే కాన్వాయ్‌కు చెందినదో కాదో విషయంపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే సువేందు అధికారి మోయినాలో జరిగిన పార్టీ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా నివేదించింది. మరోవైపు ప్రమాదానికి కారణమైన సువేందు అధికారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇక నందిగ్రామ ఎమ్మెల్యే సువేందు అధికారి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

దీనిపై సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ రాత్రి 10.30 గంటలకు పెట్రోల్ బంక్‌ దగ్గర రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టింది.   స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించాడు. మృతుడిని సీక్ ఇస్రాఫిల్‌గా గుర్తించాం. ఎమ్మెల్యే సువేందు కాన్వాయ్‌ కారు గుద్దడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిని ఇంకా ధృవీకరించలేదు. దీనిపై సువేందు అధికారితో సహా బీజేపీ నాయకులెవరూ స్పందించలేదు.’ అని తెలిపారు.
చదవండి: కలబురిగిలో నువ్వా.. నేనా! హైదరాబాద్‌ కన్నడనాట తీవ్ర పోటీ 

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)