Breaking News

Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్‌ చేసుకోవచ్చు

Published on Tue, 12/17/2024 - 07:24

2024కు వీడ్కోలు పలుకుతూ కొద్దిరోజుల్లో కొత్త  ఏడాది 2025ను స్వాగతించబోతున్నాం. ఈ నేపధ్యంలో 2024లో జరిగిన ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి నెమరువేసుకుందాం. వాటిలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు ఒకటి. ఈ ప్రాంతాలకు సామాన్యులు కూడా తక్కువ బడ్జెట్‌తో వెళ్లిరావచ్చు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

ఈ  ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అరబ్‌ దేశంలోని బీఏపీఎస్‌ హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. భారత్‌- యూఏఈ మధ్య  పలు  ఒప్పందాలు కుదుర్చుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను ప్రధాని మోదీ సందర్శించారు. టూరిజంరంగంలో యుఎఈ మరింతగా విస్తరిస్తోంది. దీంతో విదేశాల్లో పర్యటించాలనుకునేవారికి యూఏఈ మొదటి ఎంపికగా మారింది. ఈ దేశంలోని దుబాయ్ నగరాన్ని దర్శించాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. ప్రతి ఏటా భారత్‌తో పాటు పలు దేశాలకు చెందిన పర్యాటకులు యూఏఈని చూసేందుకు తరలివస్తుంటారు.

భూటాన్

భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్‌గే ఆహ్వానం మేరకు ఈ ఏడాది నరేంద్ర మోదీ భూటాన్‌లో పర్యటించారు. భూటాన్ భారత్‌కు పక్కనేవున్న పర్యాటక దేశంగా గుర్తింపు పొందింది. తక్కువ బడ్జెట్‌లో విదేశాలకు వెళ్లాలనుకునేవారికి భూటాన్‌ సందర్శన ఉత్తమ ఎంపిక. వీసా లేకుండా భూటాన్‌లో 14 రోజుల పాటు ఉండేందుకు భారతీయులకు అనుమతి ఉంది. భూటాన్‌ వెళ్లేవారు అక్కడి అందమైన అడవులను, దేవాలయాలను సందర్శించవచ్చు.

ఇటలీ

50వ జీ7 సదస్సు కోసం ప్రధాని మోదీ ఈ ఏడాది ఇటలీలో పర్యటించారు. ఐరోపాలోని ఇటలీ అందమైన దేశంగా పేరొందింది. సినీతారలు ఇటలీని తరచూ సందర్శిస్తుంటారు. అలాగే ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు  ఇటలీకి తరలివస్తుంటారు. చాలామంది జీవితంలో ఒక్కసారైనా ఇటలీని సంద్శించాలని భావిస్తుంటారు. ఇటలీలోని రోమ్, ఫ్లోరెన్స్, వెనిస్, అమాల్ఫీ కోస్ట్  మొదలైనవి చూడదగిన ప్రాంతాలు.  

రష్యా

22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఇందుకోసం ప్రధాని ఈ ఏడాది రష్యాలో పర్యటించారు. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు ఈ దేశాన్ని సందర్శించడానికి వస్తుంటారు. భారీ పర్వతాలు, ఎడారులు, అందమైన బీచ్‌లు, వారసత్వ ప్రదేశాలు, రాజభవనాలు, మంచుతో నిండిన సరస్సులను ఈ దేశంలో చూడవచ్చు. ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాలలో రష్యా  ఒకటి. ఇక్కడి మాస్కో, వ్లాడివోస్టాక్ ప్రాంతాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తాయి.

సింగపూర్


ఈ ఏడాది  ప్రధాని మోదీ సింగపూర్‌లో పర్యటించారు. సింగపూర్ సంపన్న దేశంగా పేరొందింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు సంగపూర్‌ సందర్శనకు వస్తుంటారు. ఇక్కడి అందమైన మ్యూజియం, జురాంగ్ బర్డ్ పార్క్, రెప్టైల్ పార్క్, జూలాజికల్ గార్డెన్, సైన్స్ సెంటర్ సెంటోసా ఐలాండ్, పార్లమెంట్ హౌస్, హిందూ, చైనీస్,  బౌద్ధ దేవాలయాలు, చైనీస్, జపనీస్ గార్డెన్‌లు చూడదగిన ప్రదేశాలు. విదేశాలను సందర్శించాలనుకునేవారికి సింగపూర్‌ ఉత్తమ ఎంపిక అని చెప్పుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఐదేళ్లకు జాతర.. లక్షల జీవాలకు పాతర.. నేపాల్‌లో ఘోరం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)