Breaking News

మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్

Published on Wed, 03/26/2025 - 07:27

నోయిడా: మద్యం ప్రియులకు శుభవార్త. ఆ రాష్ట్రంలోని మద్యం దుకాణంలో ఒక బాటిల్‌ కొంటే మరొక బాటిల్‌ ఉచితం(Buy one bottle, get another bottle free). పైగా ఫుల్‌ బాటిల్‌ కొంటే రూ. 200 డిస్కౌంట్‌. ఇది ఏ ఒక్క మద్యం దుకాణానికో పరిమితం కాదు. పలు జిల్లాల్లో ఈ ఆఫర్‌ కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులంతా ఆయా దుకాణాల ముందు బారులు తీరుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మద్యంపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నారు. తాజాగా మంగళవారం నోయిడాలోని ఒక దుకాణంలో ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం అనే ఆఫర్ పెట్టడంతో  మద్యం ప్రియులు భారీ సంఖ్యలో క్యూకట్టారు. కాగా మద్యంపై  తగ్గింపు ధరలు ఒక్క నోయిడాకు మాత్రమే పరిమితం కాలేదు. యూపీలోని పలు జిల్లాల్లో మద్యంపై అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఒక బాటిల్ కొనుగోలు చేస్తే మరొక బాటిల్‌, మరికొన్ని చోట్ల పూర్తి బాటిల్ కొనుగోలు చేస్తే రూ. 200 వరకు తగ్గింపు  అందిస్తున్నారు.

ఎన్‌డీటీవీ పేర్కొన్న కథనం ప్రకారం నోయిడా సెక్టార్ 18లోని ఒక మద్యం దుకాణం ముందు ‘ఒక బాటిల్ కొంటే ఒకటి ఉచితం’ అనే బోర్డు పెట్టగానే మద్యం ప్రియులు పరిగెత్తుకుంటూ ఆ దుకాణానికి చేరుకున్నారు. దీంతో అక్కడ ఏదో జాతర జరుగుతున్నలాంటి దృశ్యం కనిపించింది. కొందరు క్యూలో నిలుచుని మద్యం కోనుగోలుకు వేచిచూడగా, మరికొందరు ఇతరులతో గొడవపడుతూ, మద్యం కొనుగోలుకు ప్రయత్నించారు. అక్కడున్నవారికి మద్యం బాటిల్‌ దొరకగానే ఏదో జాక్‌పాట్‌ తగిలినట్లు ఆనందించారు.
 

ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ జిల్లాలో మద్యం దుకాణాలలో భారీ ఆఫర్లు ప్రకటించడంతో ఆయా దుకాణాలకు మందుబాబులు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే భారీగా నిల్వవున్న మద్యం బాటిళ్లను ఖాళీ చేసేందుకే ఇక్కడి మద్యం దుకాణాలలో ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ముజఫర్ నగర్‌లోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం కొనుగోలుకు వేచిచూస్తున్న రాహుల్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ ఒక బాటిల్ కొనుగోలుకు మరొక బాటిల్‌ ఉచితం అనే ఆఫర్‌ పెట్టడంతో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పాడు.

యూపీలోని మద్యం స్టాకును అమ్మేందుకు మార్చి 25 చివరి తేదీ. అయితే మద్యం కాంట్రాక్టర్లు(Liquor contractors) మరో ఐదు రోజుల గడువుకోరి, డిస్కౌంట్లు అందిస్తూ జోరుగా మద్యం అ‍మ్మకాలు సాగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఈ-లాటరీ ద్వారా కొత్తగా మద్యం దుకాణాలను కేటాయించారు. ఈ నేపధ్యంలో కొందరు మద్యం దుకాణాల నిర్వాహకులు ఈ-లాటరీలో దుకాణాలను దక్కించుకోలేకపోయారు. మరోవైపు మార్చి 31 నాటికి పాత దుకాణాల్లో స్టాక్‌ను పూర్తిగా ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా మద్యం దుకాణాల్లో తగ్గింపు ధరలు కొనసాగుతున్నాయి. 

ఇది కూడా చదవండి: Delhi Budget: రూ. ఒక లక్ష కోట్లు.. బీజేపీ వరాల జల్లు

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)