Breaking News

మెస్సీకి అనంత్‌ అంబానీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌, ఖరీదెంతో తెలుసా?

Published on Wed, 12/17/2025 - 11:05

ఫుల్‌బాల్‌ దిగ్గజం  లియోనెల్ మెస్సీ  Goat ఇండియా టూర్' వార్తల్లో నిలుస్తోంది.  స్టార్‌ ప్లేయర్‌ భారత గడ్డపై అడుగుపెట్టి ఏ నగరంలో పర్యటించినా  దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  తాజాగా మెస్సీ రిలయన్స్‌ అధినేత ముఖేష్‌  అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయన్స్ ఫౌండేషన్  వన్యప్రాణుల రక్షణ, పునరావాస మరియు పరిరక్షణ కేంద్రమైన  వంతారను సందర్శించారు.  సందర్భంగా ఆ బిలియనీర్ వ్యాపారవేత్త మెస్సీకి అత్యంత అరుదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారనే ఇపుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

 అర్జెంటీనా దిగ్గజం మెస్సీతో భేటీ సందర్భంగా ఆ స్టార్‌కు అత్యంత విలాసవంతమైన బహుమతి  అందించారు  అనంత అంబానీ .మెస్సీకి 1.2 మిలియన్ డాలర్ల విలువైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. దీని విలువ సుమారు  రూ. 11 కోట్లు.  వంతార సందర్శన కార్యక్రమం మధ్యలో అత్యంత అరుదైన రిచర్డ్ మిల్లే టైమ్‌పీస్‌ను ధరించి కనిపించడం విశేషంగా నిలిచింది. మెస్సీ వాచ్ లేకుండా వచ్చారని, ఆ తర్వాత రిచర్డ్ మిల్లే RM 003-V2 GMT టూర్‌బిల్లాన్ 'ఏషియా ఎడిషన్' ధరించి కనిపించాడు అంటున్నారు పరిశీలకులు.

స్పెషల్‌ ఎడిషన్‌గా వచ్చిన ఈ వాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 12 మాత్రమే ఉన్నాయట. బ్లాక్‌ అండ్‌  వైట్‌ కార్బన్ కేస్ , స్కెలిటన్ డయల్‌ ఉన్న ఈ  స్పెషల్‌ వాచ్ మెస్సీ, అనంత అంబానీ మధ్య ఉన్న సన్నిహిత బంధానికి ప్రతీకగా నిలిచింది. అంతేకాదు స్పెషల్‌ అకేషన్‌కు  గుర్తుగా విలాసవంతమైన జీవనశైలికి , ఖరీదైన వాచీలు అంటే ఇష్టపడే అనంత్‌ వాచ్‌ రిచర్డ్ మిల్లే RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్‌ను ధరించారు.  దీని విలువ 5 మిలియన్ డాలర్లు అంటే సుమారు 45.59 కోట్ల రూపాయలు.

కాగా మెస్సీ వంతార సాంస్కృతిక, మానవతా భావాలను ప్రతిబింబంగా నిలిచింది. ఇక్కడ అనుసరించే సంప్రదాయాలకు అనుగుణంగా, సాంప్రదాయ హిందూ ఆచారాలలో పాల్గొని ఆశీర్వాదం తీసుకున్నాడు. మహా ఆరతిలో పాల్గొని అంబే మాత పూజ, గణేష్ పూజ, హనుమాన్ పూజ ,  శైవాభిషేకం లాంటి పూజలు,  ప్రార్థనలు చేశాడు. 

లియోనెల్ మెస్సీ గౌరవార్థం అనంత్ రాధిక అంబానీ ఇష్టమైన సింహం పిల్లకు 'లియోనెల్' అని పేరు  పెట్టడం విశేషం.  ఇక్కడి సింహాలు, చిరుతలు, పులులు, ఏనుగులు, అధునాతన పశువైద్య సంరక్షణలో అభివృద్ధి చెందుతున్న సరీసృపాలతో సంభాషించాడు మెస్సీ. ముఖ్యంగా బుజ్జి ఏనుగు మాణిక్‌లాల్‌తో ఆటపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


GOAT టూర్ 2025లో భాగంగా  లియోనెల్‌ మెస్సీ ఇండియాలో పలు నగరాల్లో పర్యటించాడు. శనివారం కోల్‌కతాలో అడుగుపెట్టి, అదే అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ను సందర్శించాడు. ఆ మరుసటి రోజు ముంబై, వంతారా, సోమవారం ఢిల్లీ పర్యటనతో ఈ పర్యటన ముగిసింది. ఈ  పర్యటన సందర్భంగా తనకు లభించిన అపారమైన ప్రేమకు లియోనెల్ మెస్సీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాలో ఒక నోట్‌ పోస్ట్‌ చేశాడు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌