డిజిటల్‌ అరెస్ట్‌ కేసులో... 9 మందికి యావజ్జీవం

Published on Sun, 07/20/2025 - 04:38

కోల్‌కతా: డిజిటల్‌ అరెస్ట్‌ సైబర్‌ మోసం కేసులో దేశంలోనే మొట్టమొదటిసారిగా పశ్చిమబెంగాల్‌ కోర్టు 9 మందికి యావజ్జీవ శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించింది. పెరిగిపోతున్న సైబర్‌ నేరాల కట్టడికి దేశం సాగిస్తున్న పోరులో నడియా జిల్లా కల్యాణి కోర్టు తీర్పు మైలురాయిగా నిలిచిపోనుంది. ఘటన జరిగిన ఎనిమిది నెలల్లోనే విచారణ పూర్తి చేసి, అదనపు సెషన్స్‌ జడ్జి తీర్పు వెలువరించడం మరో విశేషం. 

దోషుల్లో మహారాష్ట్రకు చెందిన నలుగురు, హరియాణా వాసులు ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. పార్థ కుమార్‌ ముఖర్జీ అనే రిటైర్డు సైంటిస్ట్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు డిజిటల్‌ అరెస్ట్‌ బూచి చూపి ఏకంగా కోటి రూపాయలు గుంజారు. ముంబై పోలీస్‌ అధికారినంటూ ఈ ముఠాలోని వ్యక్తి ముఖర్జీకి వాట్సాప్‌ కాల్‌ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడినందున డిజిటల్‌ అరెస్ట్‌ తప్పదంటూ బెదిరించాడు. దీంతో, ఆయన ఈ ముఠా సభ్యులకు చెందిన పలు బ్యాంకు అక్కౌంట్లకు రూ.కోటి ట్రాన్స్‌ఫర్‌ చేశారు. మోసపోయినట్లు గుర్తించిన ముఖర్జీ 2024 అక్టోబర్‌లో ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన రాణాఘాట్‌ సైబర్‌ క్రైం స్టేషన్‌ పోలీసులు నిందితులను గుర్తించి నాలుగున్నర నెలల్లో అంటే 2025 ఫిబ్రవరి 24వ తేదీతో విచారణ ముగించారు. మొత్తం విచారణ ప్రక్రియ 8 నెలల్లోనే పూర్తవడం విశేషమని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బివాస్‌ చటర్జీ చెప్పారు. ఈ ముఠా భారత సిమ్‌ కార్డులతో కంబోడియా నుంచి బాధితుడికి ఫోన్లు చేసి బెదిరించారన్నారు. ఇలా వీరు 100 మందిని మోసగించారని తెలిపారు. మహారాష్ట్ర, హరియాణా, గుజరాత్, రాజస్తాన్‌లకు చెందిన 13 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు 9 మందిపై ఫోర్జరీ, కుట్ర తదితర నేరారోపణలు చేశారన్నారు.   
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)