Breaking News

అమ్మకానికి కుంభమేళా మహిళల పుణ్య స్నానాల వీడియోలు!

Published on Thu, 02/20/2025 - 21:09

లక్నో : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు (Kumbh Mela) భక్తులు పెద్దఎత్తున తరలివస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు 56 కోట్ల మందికి పైగా భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.ఈక్రమంలో కుంభమేళాలో స్నానం చేస్తున్న మహిళా భక్తుల వీడియోలు విక్రయిస్తున్న,కొనుగోలు చేస్తున్న నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఇప్పటివరకు 103 సోషల్ మీడియా ఖాతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

యూపీ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ కుంభమేళాలో మహిళలు స్నానమాచరించడం, దుస్తులు మార్చుకునే వీడియోల్ని పలువురు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో కొన్ని సోషల్ మీడియా ప్రొఫైళ్లు, గ్రూపుల్లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించి, వాటిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు కుంభమేళా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ మీడియాతో తెలిపారు. బుధవారం  కుంభమేళాలో స్నానం చేయడంతో పాటు, దుస్తులు మార్చుకుంటున్న మహిళల వీడియోల్ని తీస్తున్నారు. వాటిని అమ్మకానికి పెడుతున్నట్లు సమాచారం వచ్చింది.

ఆ వీడియోలను అమ్మేవారిని, కొనుగోలు చేసే వారిని అరెస్ట్ చేస్తాం. మా సోషల్ మీడియా టీమ్ నిరంతరం వీటిని మానిటర్ చేస్తోంది. ఎవరైతే మహిళల ప్రైవేట్ వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారో, వారి ప్రొఫైళ్లపై చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు.

ఇప్పటివరకు ఎంతమంది వ్యక్తులు లేదా గ్రూపులను గుర్తించారనే సమాచారంపై డీఐజీ వైభవ్‌ కృష్ణ స్పందించారు. 103 సోషల్ మీడియా ప్రొఫైళను గుర్తించాం. వీటిలో ప్రజల్ని భయాందోళనకు గురి చేసే అకౌంట్లతో పాటు మహిళల ప్రైవేట్ వీడియోలను పోస్ట్ చేస్తున్న అకౌంట్లు ఉన్నట్లు వెల్లడించారు. 26 సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫారమ్‌లలో కుంభమేళాలో స్నానమాచరించే మహిళల వీడియోల్ని అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్నవారందరిపై చర్యలు తీసుకుంటామని కుంభమేళా డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (DIG) వైభవ్ కృష్ణ హెచ్చరించారు.  

కాగా, కుంభమేళాలో మహిళల వీడియోల్ని తీస్తున్న దుండగులు ఒక్కో వీడియోను రూ.2వేల నుంచి రూ.3వేల వరకు విక్రయిస్తున్నారని తెలుస్తోంది.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)